ఓ మై గాడ్: లైవ్ లోనే విడాకులు ప్రకటించిన స్టార్ యాంకర్..గూబ గుయ్యమనిందిగా..!!

ప్రపంచవ్యాప్తంగా ఉండే ప్రేమికులు ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఎదురుచూసిన రోజు మరో రెండు రోజుల్లోనే రాబోతుంది . మేము ప్రేమికులం అంటూ ప్రత్యేకంగా చెప్పుకుని ” ఐ లవ్ యు ” అంటూ చెప్పుకునే రోజు వాలెంటైన్స్ డే . ఈ క్రమంలోని ప్రపంచవ్యాప్తంగా ఉండే ప్రేమికులు .. రొమాంటిక్ కపుల్స్ వాలెంటైన్స్ డే ను సరదాగా సెలబ్రేట్ చేసుకోవడానికి రకరకాలుగా ప్లాన్ చేసుకుంటున్నారు . కాగా ప్రేమకు గుర్తుగా జరుపుకునే వాలెంటైన్స్ డే కి కొన్ని రోజుల ముందు స్టార్ యాంకర్.. విడాకులు ప్రకటించి సెన్సేషన్ సృష్టించింది .

ఫాక్స్ న్యూస్ యాంకర్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న జూలీ లైవ్ లోనే విడాకుల ప్రకటించి ఇంటర్నేషనల్ న్యూస్ లో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వాలెంటైన్స్ డేకు కరెక్ట్ గా రెండు రోజులు ముందే ఇలా తన భర్తకు విడాకులు ఇస్తాను అంటూ లైవ్ లోనే ప్రకటించడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పైగా వాలెంటైన్స్ సెగ్మెంట్ లోనే ఇలాంటి న్యూస్ చెప్పడంతో ప్రేక్షకులు షాక్ అయిపోయారు.

2009లో ఆండ్రూ సనన్ ను పెళ్లి చేసుకున్న ఆమె వాలెంటైన్స్ డే సెగ్మెంట్లో పాల్గొని .. “F*** వాలెంటైన్స్ డే” అంటూ హోస్ట్ కు రిప్లై ఇవ్వడం షాకింగ్ అనిపించింది .

https://cdn.jwplayer.com/previews/infFGLby

ఇప్పటివరకు తన జీవితంలో తీసుకున్న గొప్ప నిర్ణయం ఇదే అంటూ చెప్పుకోరావడం మైండ్ బ్లాకింగ్ అనిపించింది. ఈ క్రమంలోనే అందరూ తనకి కంగ్రాట్స్ చెప్పబోయే ముందే ఆమె థాంక్స్ అని చెప్పేసింది. దీంతో ప్రజెంట్ ఈ న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!