అమ్మ బాబోయ్..సమంత అంత రిచ్చా.. ఒక్క రోజుకు అంత డబ్బు ఖర్చు చేస్తుందా..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పాపులారిటీ సంపాదించుకున్న సమంత .. ప్రెసెంట్ టాలీవుడ్ – బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలకు కమిట్ అవుతూ దూసుకుపోతుంది . రీసెంట్ గానే సమంత నటించిన శాకుంతలం ట్రైలర్ రిలీజ్ అయి ఎలాంటి టాక్ అందుకుందో అందరికీ తెలిసిందే. మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్న ఈమె శాకుంతలం ప్రాజెక్ట్ కోసం ఇచ్చిన కమిట్మెంట్ కోసం సినిమా ప్రమోషన్స్ కోసం దక్షిణ కొరియా నుంచి ఇండియాకి వచ్చింది.

ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ లో కూడా సమంత నిరసించిపోయి కనిపించింది . కాగా ఫిబ్రవరి 17న రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా వాయిదా పడింది. పలు కారణాల చేత ఈ సినిమా ఏప్రిల్ 14 కు పోస్ట్ పోన్ చేశారు . కాగా ఈ క్రమంలోనే మిగతా సినిమాకి సంబంధించిన షెడ్యూల్ స్టార్ట్ చేసింది సమంత . త్వరలోనే శివనిర్వాణ డైరెక్షన్లో తెరకెక్కబోతున్న ఖుషి సినిమాకి సంబంధించిన షూటింగ్ పనులను ప్రారంభించింది సమంత . కాగా ఈ క్రమంలోనే మయోసైటిస్ కోసం కొత్త ట్రీట్మెంట్ ని తీసుకుంటుంది సమంత . ఇదే విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేసింది .

మయోసైటిస్‌(ంయొసితిస్)కి సంబంధించిన నెలవారి ఐవీఐజీ(ఇంట్రావీనస్‌ ఇమ్యూనోగ్లోబలిన్‌ థెరఫీ) సెషన్‌కి హాజరైనట్టు తెలిపింది. ఈ క్రమంలోనే సమంత ఒక్కరోజు వైద్యం ఖర్చు గురించి తెలుసుకున్న అభిమానులు షాక్ అవుతున్నారు ఐవీజీ ట్రీట్మెంట్ ఎంతో ఖరీదైన సంగతి అందరికీ తెలిసిందే . 10 గ్రాముల సీసా కాస్ట్ సుమారు 20వేలకు పైగానే ఉంటుంది . బరువును బట్టి 12 గంటల్లో రెండు గ్రాములు మోతాదులు విఐపి మెడిసిన్ ఇస్తూ ఉంటారు డాక్టర్లు. కాగా సమంత బరువు 55 కిలోలు ..ఈ లెక్కన చూసుకుంటే సమంతకు దీని ఖరీదు దాదాపు లక్ష పైనే పడుతుంది . ఇక మిగతా ఖర్చులు అందరూ అన్ని చూసుకున్న దాదాపు రెండు లక్షల 50 వేలకు పైగానే పడుతుందట. దీంతో సమంత డేరింగ్ కి హ్యాట్సాఫ్ అంటున్నారు జనాలు . అంతేకాదు సమంత చాలా రిచ్ అని పలువురు కామెంట్స్ చేస్తూ ..ఈ టైం లోను ఆమెను ట్రోల్ చేస్తున్నారు . ఇలాంటి ట్రీట్మెంట్ తీసుకోకుండా ఉంటే సమంత ఆరోగ్యం మరింత క్షీణించే అవకాశం ఉంది అంటూ డాక్టర్లు చెప్పుకొస్తున్నారు..!!