వావ్: ఆ స్టార్ హీరో కి బ్రదర్ గా బన్నీ.. ఇక బాక్స్ ఆఫిస్ షేక్ అవ్వాల్సిందే..!!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న అల్లు అర్జున్ గురించి ఎంత చెప్పినా తక్కువే . క్రేజ్ , ఫ్యాన్ ఫాలోయింగ్ లో నెంబర్ వన్ హీరోగా దూసుకుపోతున్న బన్నీ ..ప్రజెంట్ పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు చేస్తూ దుమ్ము దులిపేస్తున్నాడు.. నిన్న మొన్నటి వరకు 540 కోట్లు పారితోషం తీసుకునే బన్నీ ఏకంగా పుష్ప2 కోసం 100 కోట్లు రెమ్యూనరేషన్ ఛార్జ్ చేస్తున్నాడు అంటూ వార్తలు వినిపించాయి.

ఈ క్రమంలోనే నార్త్ లో కూడా పుష్పరాజ్ కు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది . అంత ఎందుకు స్టార్ట్ బ్యూటీలు దీపిక పదుకొనే , ఆలియా భట్ , జాన్వి కపూర్ లాంటి వాళ్ళు కూడా బన్నీతో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఉంది అంటూ ఓపెన్ గా చెప్పుకొచ్చారు . ఈ క్రమంలోనే నార్త్ లోను విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోవడంతో అక్కడ కూడా అల్లు అర్జున్ కి మంచి మార్కెట్ ఏర్పడింది.

ఈ క్రమంలోనే బాలీవుడ్ లో బడా అవకాశం అందుకున్నట్లు తెలుస్తుంది . బాలీవుడ్ బాద్షాగా పేరు సంపాదించుకున్న కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ చిత్రంలో ఆయనకు బ్రదర్ గా నటించబోతున్నాడట బన్నీ . ఇదే న్యూస్ ఇప్పుడు బాలీవుడ్ మీడియాలో వైరల్ అవుతుంది. చాలా కాలం త ర్వాత పటాన్ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ హీరో త్వరలోనే Jawaan ప్రాజెక్టులో భాగమవుతున్నాడు . అందులో అల్లు అర్జున్ కూడా షారుక్ ఖాన్ కి బ్రదర్ గా కనిపించబోతున్నాడు అంటూ బాలీవుడ్ మీడియా చెప్పకు వస్తుంది . దీంతో నార్త్ లోను బన్నీ క్రేజ్ చూసి టాలీవుడ్ హీరోలు షాక్ అయిపోతున్నారు..!!