పెళ్లి విష‌యంలో మ‌ళ్లీ హీట్ పెంచేసిన ర‌కుల్‌…!

టాలివుడ్ లో త‌న‌ మొదటి సినిమాతోనే కుర్రకారును తనవైపు తిప్పుకున్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్..ఆ తర్వాత వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది.. ఇప్పుడు బాలివుడ్ లో వరుస సినిమాలను చేస్తూ వస్తుంది.. అయితే అక్కడ కూడా అందాల ఆరబోస్తూ యూత్ ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది.. బాలీవుడ్ లో మాత్రం సక్సెస్ అందుకోవడానికి వరుస‌ సినిమాల్లో నటిస్తుంది.

తాజాగా అయితే మరోసారి ఈమె పెళ్లి రూమర్లతో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. బాలీవుడ్ యంగ్ ప్రొడ్యూసర్ అండ్ హీరో జాకీ భగ్నానీతో రకుల్ ప్రేమలో ఉంది. జాకీ తో కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. దీనికి తోడు గతంలో ఓ ఇంటర్వ్యూలో రకుల్ తన పెళ్లి విషయం పై ఓపెన్ గా మాట్లాడింది. జాకీ భగ్నానీతో ప్రేమలో ఉన్నాను అని ఆమె చెప్పుకొచ్చింది.

Rakul Preet Singh wishes dad on his birthday, boyfriend Jackky reacts. See  pics | Bollywood - Hindustan Times

రీసెంట్గా రకుల్ తన ప్రియుడు జాకీ భ‌గ్నానీతో కలిసి దిగిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. దాంతో రకుల్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతుంది అంటు సోషల్ మీడియాలో తెగ రూమర్లు వచ్చాయి. మొత్తానికి తన పెళ్లిపై జరుగుతున్న ఈ రూమర్లకు రకుల్ పులిస్టాప్ పెడుతుందా ? లేదా అవి నిజమే అని క్లారిటీ ఇస్తుందా? అనేది చూడాలి. నిజానికి గత కొన్ని రోజులుగా రకుల్ పెళ్లి చేసుకోబోతుందంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ వార్తలకి ఎలాంటి సమాధానం ఇస్తుందో చూడాలి.