పెళ్లిరోజున నమ్రతకు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చిన మహేష్.. సూపర్ స్టార్ అనిపించుకున్నాడుగా..!

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన 28వ సినిమాను త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్నాడు. రీసెంట్ గానే ఈ సినిమా రెండో షెడ్యూల్ షూటింగ్‌ను ప్రారంభించిన త్రివిక్రమ్ ఇక నిన్నటితో ఈ షెడ్యూల్ షూటింగ్ కంప్లీట్ అవ్వడంతో. మహేష్ తన భార్య నమ్రత తో కలిసి నిన్న స్పెయిన్ వెకేషన్‌కు వెళ్ళాడు. ప్రస్తుతం మహేష్ తన 18వ మ్యారేజ్ యానివర్సరీ నీ సెలబ్రేట్ చేసుకోవడానికి తన భార్యతో కలిసి స్పెయిన్ వెకేషన్ కి వెళ్ళాడు.

కాగా ఈరోజు వారి మ్యారేజ్ యానివర్సరీ కావడంతో మహేష్ ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ ను సోషల్ మీడియాలో షేర్ చేశాడు..ఇక ఆ పోస్ట్ లో ’18 years together and forever to go! Happy anniversary NSG’ అని కోట్ చేస్తూ ఒక ఓల్డ్ ఫోటోగ్రాఫ్ ని కూడా మహేశ్ షేర్ చేశాడు. ఈ పోస్ట్ ను మహేష్ అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

మిస్స్ ఇండియా గా బాలీవుడ్ లో తన కెరీర్‌ను మొదలుపెట్టిన నమత్రా శిరోద్కర్. సూపర్ స్టార్ కృష్ణ కొడుకుగా సినిమాల్లోకి వచ్చిన మహేష్ బాబు. ఇప్పుడు అంటే అంతా పాన్ ఇండియా సినిమాలు వస్తుండడంతో అన్ని భాషలలో వాళ్లు కలిసి అన్ని సినిమాల్లో నటిస్తున్నారు. కానీ అప్పుడు ఉన్నా రోజుల్లో పరిస్థితులను బట్టి చూస్తే మహేష్- నమ్రతల ప్రయాణం నిజానికి కలిసె అవకాశం లేదు. అలాంటిది మహేష్- నమ్రతలు కలిసి వంశీ సినిమా చేశారు. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. అలా వీరిద్దరి మధ్య ప్రేమ ఏర్పడింది తర్వాత వీరిద్దరూ పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు.

ఈ రకంగా మహేష్ లైఫ్ లోకి నమ్రత ఎంట్రీ ఇచ్చి నేటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అప్పటినుంచి మహేష్ కు నమ్రత బ్యాక్ బోన్ గా నిలుస్తూ మహేష్ కు అన్ని విధాలుగా అండగా ఉంటుంది. మహేష్ కూడా ఎంత బిజీగా ఉన్నా ఫ్యామిలీతో తన టైం స్పెండ్ చేయకుండా ఉండడు. ఇద్దరు ఇలానే హ్యాపీగా ఉండాలని మహేష్ అభిమానులు కోరుకుంటున్నారు.