పెళ్లి వీడియో పంచుకున్న కియారా-సిద్ధార్థ్‌.. హైలెట్‌గా లిప్ లాక్!

బాలీవుడ్‌ లవ్‌ బర్డ్స్‌ సిద్ధార్థ్‌ మల్హోత్రా, కియారా అద్వానీ పెళ్లి బంధంతో ఒక‌టైన సంగ‌తి తెలిసిందే. `షేర్షా` మూవీతో ఏర్ప‌డ్డ వీరి ప‌రిచ‌యం ప్రేమ‌గా మార‌గా.. ఇప్పుడు పెళ్లి వ‌ర‌కు తీసుకువ‌చ్చింది. ఫిబ్ర‌వ‌రి 7వ తేదీన రాజస్థాన్‌ జైసల్మేర్‌లోని సూర్యగఢ్‌ ప్యాలెస్‌లో కుటుంబ‌స‌భ్యులు, సన్నిహితుల సమక్షంలో కియారా-సిద్ధార్థ్ అంగ‌రంగ వైభ‌వంగా వివాహం చేసుకున్నారు.

వీరి పెళ్లిలో ప‌లువురు బాలీవుడ్ ప్ర‌ముఖులు కూడా సంద‌డి చేశారు. వివాహంలో లేత గులాబీ వర్ణం లెహంగాలో కియారా, బంగారు వర్ణం షార్వానీలో సిద్ధార్థ్ మెరిసిపోయారు. ఇప్ప‌టికే వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొట్టాయి. అయితే తాజాగా ఈ నూత‌న జంట త‌మ పెళ్లికి సంబంధించిన ఓ వీడియోను అంద‌రితోనూ పంచుకున్నాడు.

‘షేర్షా’ చిత్రంలోని పాటకు డ్యాన్స్‌ చేస్తూ వివాహ వేదికపైకి చేరుకుంది. అనంతరం కియారా-సిద్ధార్థ్‌ దండలు మార్చుకున్నారు. ఇక కియారా-సిద్ధార్థ్ ల‌ లిప్ లాక్ ఈ వీడియోలో బాగా హైలెట్ అయింది. ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట తెగ చ‌క్క‌ర్లు కొడుతోంది. ఈ వీడియోను చూసి అభిమానులు తెగ మురిసిపోతున్నారు. అలాగే నూత‌న దంప‌తుల‌కు బెస్ట్ విషెస్ ను తెలుపుతున్నారు. కాగా, ఈ నెల 12వ తేదీన ముంబైలో కియారా-సిద్ధార్థ్ వివాహ రిసెప్ష‌న్ ఉంటుంద‌ని టాక్ న‌డుస్తోంది.

https://www.instagram.com/reel/CoePqigAHTC/?utm_source=ig_web_copy_link