`NBK 108`పై ఫ్యాన్స్‌కి కిక్కిచ్చే అప్డేట్‌.. బాలయ్య డబుల్ కాదు ట్రిపుల్..!?

నట‌సింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. `ఎన్‌బీకే 108` వర్కింగ్ టైటిల్ తో ఏ మూవీ ని ఇటీవలె సెట్స్ మీద‌కు తీసుకెళ్లారు. షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్ పై సాహో గార‌పాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తండ్రి కూతురు మధ్య ఈ మూవీ కథ సాగుతుందని.. ఇందులో బాలయ్య కూతురుగా శ్రీలీల నటించిపోతోందని ఇప్పటికే అనిల్ రావిపూడి వెల్ల‌డించాడు.

అయితే తాజాగా ఈ మూవీపై నందమూరి ఫ్యాన్స్ కి మాంచి కిక్కిచ్చే అప్డేట్ ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. అదేంటంటే.. ఈ చిత్రంలో బాలకృష్ణ రెండు విభిన్నమైన గెటప్స్ లో కనిపించబోతున్నాడ‌ని ఎప్ప‌టి నుంచి ప్ర‌చారం జ‌రుగుతోంది. కానీ, డ‌బుల్ కాదు ట్రిపుల్ గెట‌ప్స్ లో బాల‌య్య అల‌రించబోతున్నాడట‌.

సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో బాలయ్య ఏకంగా మూడు గెటప్స్ లో కనిపించబోతున్నాడు అని.. ఆ మూడు గెటప్స్ కూడా చాలా విభిన్నంగా ఉంటాయ‌ని తెలుస్తోంది. కథలో భాగంగా మూడు పదుల వయసు వ్యక్తిగా కనిపించి ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల జైలుకు వెళ్లి యాబై ఏళ్ల వయసు వ్యక్తిగా బయటకు వస్తాడు. ఇవి రెండు కాకుండా మ‌రో పాత్ర ఏంటీ అనేది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.