వెనుకబడిన కొడాలి..గుడివాడలో టీడీపీకి ఛాన్స్.!

ఎమ్మెల్యేగా ఉంటూ గడపగడపకు తిరగడంలో కొడాలి నాని విఫలమయ్యారు. పూర్తి స్థాయిలో ప్రజల్లో తిరగడం లేదు..ఆ విషయం స్వయంగా కొడాలి నాని సైతం ఒప్పుకున్నారు. తాజాగా జరిగిన వర్క్ షాప్ లో జగన్..తమకు క్లాస్ పీకారని చెప్పుకొచ్చారు. తన లాంటి బద్ధకస్తులకు జగన్ గట్టిగానే క్లాస్ ఇచ్చారని, ఇకనైనా ప్రజల్లోకి వెళ్లాలని సూచించారని అన్నారు.

అంటే ప్రజల్లో తిరగడం లేదనే కొడాలి ఒప్పుకున్నారు. పైగా అధికారంలోకి వచ్చాక గుడివాడకు కొడాలి చేసిందేమి కనబడటం లేదు. ఎందుకంటే గత మూడు పర్యాయాలు ప్రతిపక్షంలో ఉన్నానని అందుకే ఏం చేయలేకపోయానని కొడాలి..ప్రజలకు చెబుతూ గెలుస్తూ వచ్చారు. 2004లో టి‌డి‌పి నుంచి గెలిచినప్పుడు..ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నారు. 2009లో కూడా అదే పరిస్తితి. ఇక 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచారు. అప్పుడు వైసీపీకి ప్రతిపక్షమే. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి మళ్ళీ గెలిచారు. కానీ ఈ సారి వైసీపీ అధికారంలోకి వచ్చింది. అటు కొడాలి మంత్రి అయ్యారు.

మూడు ఏళ్ళు మంత్రిగా ఉంటూ కొడాలి గుడివాడలో చేసిన అభివృద్ధి పెద్దగా కనిపించలేదు. మంత్రి పదవి పోయాక..ఎమ్మెల్యేగా గుడివాడలో చేస్తున్న పనులు కనిపించడం లేదు. చాలా గ్రామాల్లో రోడ్లు దారుణంగా దెబ్బతిన్నాయి..తాగునీటి వసతులు తక్కువగా ఉన్నాయి. ఇలాంటి కనీస అవసరాలని సైతం తీర్చలేదు. గుడివాడకు కొత్త బస్టాండ్ అన్నారు..అది ఇంకా అవ్వలేదు.

మొత్తానికి అధికారంలో ఉన్నా సరే కొడాలి..గుడివాడని అభివృద్ధి చేయలేకపోయారు. ఇంతకాలం ప్రతిపక్షంలో ఉన్నారు అందుకే ఏం చేయలేదని జనం అనుకున్నారు..కానీ ఇప్పుడు ఆ పరిస్తితి లేదు. కాబట్టి కొడాలిపై గుడివాడ ప్రజలు అసంతృప్తిగానే ఉన్నారు. ఈ అంశాన్ని టి‌డి‌పి సరిగ్గా యూజ్ చేసుకుని బలపడితే..గుడివాడలో ఈ సారి సంచలన ఫలితం వస్తుందని చెప్పవచ్చు.