మహేష్- రాజమౌళి మూవీపై ఇంట్రెస్టింగ్ అప్డేట్.. ఫాన్స్ కు పూనకాలే..?

సూపర్ స్టార్ మహేష్ బాబు తో దర్శక ధీరుడు రాజమౌళి తన తర్వాత సినిమాను చేయబోతున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో రానున్న ఈ సినిమాపై ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా గురించి ఇప్పటికే పలు సందర్భాల్లో రాజమౌళి ఎన్నో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. ఈ సినిమాను అమెజాన్ అడవుల నేపథ్యంలో వరల్డ్ అడ్వెంచర్ స్టైల్ లో బ్రౌన్ కథల మాదిరిగా సాగే భారీ యాక్షన్ తో కుడిన అడ్వెంచర్స్ మూవీ ని సూపర్ స్టార్ మహేష్ బాబు తో చేయాలనేది తన ఆలోచనని కూడా అన్నారు.

OFFICIAL: SS Rajamouli's Next Film with Mahesh Babu! WOW! Massive  Announcement! - YouTube

ప్రస్తుతం ఇలాంటి కథపై తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ కసరత్తులు చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. ఇక ఈ సినిమాని ఇండియాలోనే ఎవరు తెరకెక్కించినీ విధంగా భారీ బడ్జెట్ తో రూపొందనుండగా దీని దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ ప్రొడ్యూస్ చేస్తున్నారు. లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదినం సందర్భంగా ఆగస్టు 9న ఈ సినిమా యొక్క అఫీషియల్ అనౌన్స్మెంట్ రానున్నట్లు తెలుస్తుంది.

అయితే మొన్నటి వరకు జూన్ లోనే ఈ సినిమా అనౌన్స్మెంట్ వస్తుందని సోషల్ మీడియాలో వార్తలు వచ్చినప్పటికీ ఈ సినిమా స్టోరీ స్క్రీన్ ప్లే పూర్తిస్థాయిలో సిద్ధం కావడానికి మరింత సమయం కావాలట.. కాగా మహేష్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను అనౌన్స్ చేయనున్నట్లు తెలుస్తుంది. ఒకవేళ ఇదే కనుక నిజమైతే మాత్రం మహేష్ అభిమానులకి పండగలాంటి వార్తనే చెప్పాలి.