మళ్లీ ప్రేమలో పడ్డ హీరోయిన్ అంజలి..!!

సౌత్ లో స్టార్ హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్న హీరోయిన్లలో అంజలి కూడా ఒకరు. తెలుగు అమ్మాయి అయినా అంజలి కోలీవుడ్ లో కూడా కమర్షియల్ హీరోయిన్ గా సక్సెస్ అయ్యింది. తెలుగులో మొదట ఫోటో అనే చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత చెన్నైకి వెళ్లి అక్కడ హీరోయిన్గా బిజీ ఆర్టిస్టుగా మారిపోయింది. తమిళంలో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకుంది అంజలి అక్కడ సక్సెస్ కొట్టడంతో చాలా కాలం తర్వాత సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో సీత పాత్రలో నటించి మంచి పేరు సంపాదించింది.

తెలుగు,తమిళ భాషలలో స్టార్ హీరోయిన్ ఇమేజెస్ ను సొంతం చేసుకున్న అంజలి తెలుగులో ప్రస్తుత కాలంలో సక్సెస్ అంతగా లేదని చెప్పవచ్చు.ఈ మధ్యకాలంలో సోలో ఫిమేల్ లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో నటించింది. పలు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ బిజీగా ఉంటోంది అంజలి. కాస్త బొద్దుగా ఉండే ఈ ముద్దుగుమ్మ ఈ మధ్యకాలంలో కాస్త సన్నగా మారిపోయిందని చెప్పవచ్చు. గతంలో కుల కోలీవుడ్ హీరో జైతో ప్రేమలో ఉన్నట్లుగా వార్తలు ఎక్కువగా వినిపించాయి కొన్ని కారణాల చేత వీరిద్దరి మధ్య బ్రేకప్ అయ్యిందని వార్తలు కూడా వినిపించాయి.

ఇక తర్వాత ఈమె ప్రేమ గురించి ఎలాంటి వార్తలు కూడా వినిపించలేదు. తాజాగా ఇంట్లోనే వేలంటైన్స్ డే ను సెలబ్రేట్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రేమికుల రోజు సందర్భంగా తన క్యాజువల్ దుస్తులలో కాస్త హాట్ లుక్ తో లవ్ సింబల్ బెలాన్ని ముఖానికి అడ్డం పెట్టుకొని మరి వాలెంటైన్స్ డే విషెస్ తెలుపుతోంది. దీంతో ఈ ఫోటో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. అయితే అభిమానులు మాత్రం ఈమె మళ్లీ ఎవరితో ప్రేమలో పడింది ఇలా సెలబ్రేట్ చేసుకుంది అనే విషయాలు తెలుసుకోవడం కోసం చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ విషయంపై ఎలా స్పందిస్తుందో అంజలి చూడాలి మరి.

 

View this post on Instagram

 

A post shared by Anjali (@yours_anjali)