పవన్ కళ్యాణ్ రాజకీయాలపై జగపతిబాబు సెన్సేషనల్ కామెంట్స్!

ప్రముఖ నటుడు జగపతి బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు హీరోగా అలరించిన జగపతి బాబు ఇప్పుడు విలన్ పాత్రలలో నటిస్తున్నారు. ఆయన నటనతో ఫ్యామిలీ ఆడియన్స్‌నే కాకుండా మాస్ ఆడియన్స్‌ని కూడా మెప్పించారు. కొంతకాలం బ్రేక్ తీసుకున్న జగపతి బాబు 2014లో బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన బాలయ్య హీరోగా నటించిన లెజెండ్ సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చి సెకండ్ ఇన్నింగ్ మొదలుపెట్టారు.

అంతకుముందు ఆయన నటించిన సినిమాలు అన్ని పరాజయం పాలవుతూ వచ్చాయి. దాంతో ఇండస్ట్రీలో జగపతి బాబు కెరీర్ ముగిసిందని అంతా అనుకున్నారు. కానీ లెజెండ్ సినిమాలో ఆయన నటించిన విలన్ పాత్రకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఆ తరువాత నుండి ఆయన వరుస సినిమాలతో దూసుకెళ్లిపోతున్నారు. జగపతి బాబు తెలుగులోనే కాకుండా తమిళ్, మలయాళం, హిందీ, కన్నడ లాంటి పలు భాషలో నటిస్తూ ఆయన సత్తా చాటుకుంటున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో జగపతి బాబు తన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకున్నారు.

ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ గురించి జగపతి బాబు మాట్లాడిన మాటలు టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ క్రమంలో నటులు కొంతమంది రాజకీయాలలో ఉన్నారు, వారిలో ఎవరంటే మీకు ఇష్టం అని అడిగిన ప్రశ్నకు జగపతి బాబ్ పవన్ కళ్యాణ్ అంటే నాకు ఇష్టం అని చెప్పారు. దాంతో ఈ వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ఇకపోతే హీరోయిన్స్ లో సౌందర్య, విలన్ పాత్రలో నటించిన హీరోయిన్స్ లో రమ్యకృష్ణ అంటే ఆయనకి ఇస్టమని చెప్పారు.

ఇక పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుతూ ఆయన కూతుర్ల గురించి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలను బయటపెట్టారు. జగపతి బాబు కి ఇద్దరు కూతుర్లు. పెద్దమ్మాయిని అమెరికా అబ్బాయికి ఇచ్చి వివాహం చేసారట. పెద్ద అల్లుడు, కూతురు అమెరికా లోనే ఉంటారట. ఇక చిన్న అమ్మాయికి ఇంకా పెళ్లి అవలేదు. తనకి నచ్చినపుడే పెళ్లి చేస్తా. ఒకరి జీవితాన్ని శాషించే హక్కు ఇంకొకరికి లేదన్నారు.