నందమూరి బాలయ్య హోస్ట్ గా మొదటిసారి వ్యవహరించిన టాక్ షో ఆన్ స్టాపబుల్ ఎంతటి సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆహా ఓటీటి వేదికగా మంచి పాపులారిటీ కూడా సంపాదించింది. గత సంవత్సరం రెండవ సీజన్లో కూడా మొదలు పెట్టి బ్లాక్ బాస్టర్ షో గా పేరు పొందింది. ఈ షో కి పోటీగా సోనీలివ్ ఒక సరికొత్త సెలబ్రిటీ టాక్ షో ప్రారంభించింది. ఇందులో నిజం విత్ స్మిత అనే పేరుతో ఈ షోని ప్రారంభించింది. దీనికి పాప్ సింగర్స్ స్మిత హోస్టుగా వ్యవహరిస్తున్నది.
మొదట చిరంజీవితో తొలి ఎపిసోడ్ ను ఫిబ్రవరి 10వ తేదీన మొదలుపెట్టింది. చిరంజీవి ఎపిసోడ్ వైరల్ కావడంతో స్మిత షో ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది. బాలయ్య అన్ స్టాపబుల్ షో తరహాలోనే ఈ షో సరికొత్తగా సాగుతోందని చెప్పవచ్చు. తాజాగా ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ షోలో పాల్గొనడం జరిగింది. అందుకు సంబంధించి ఒక ప్రోమో కూడా నెట్టింట వైరల్ గా మారింది.
షోలోకి సాధారణంగా ఆహ్వానించిన స్మిత అందరితో కూడా చాలా ఫన్నీ గానే మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను సైతం రాబట్టించేలా చేస్తోంది. ఇక అంతే కాకుండా ఎంతో మంది సెలెబ్రెటీల, రాజకీయ నాయకులతో తెలియని విషయాలను కూడా రాబట్టడంలో ఈ షో బాగానే ఆకట్టుకుంటోంది. దీంతో బాలయ్య షోకి ఈ షో గట్టి పోటీ ఇస్తోందని చెప్పవచ్చు. ప్రతి వారం ఒక ఎపిసోడ్ తో అందరినీ ఆకట్టుకుంటున్న స్మిత షో మంచి పాపులారిటీ సంపాదించుకుంది.