అభిమానులకు గుడ్ న్యూస్..తండ్రి కాబోతున్న టాలీవుడ్ హీరో..!!

ఈ మధ్యకాలంలో స్టార్ సెలబ్రిటీస్ అందరూ ఒకరి తర్వాత ఒకరు.. అభిమానులకి గుడ్ న్యూస్ చెబుతూ ఫ్యాన్స్ కు కొత్త జోష్ ని ఇస్తున్నారు. రీసెంట్ గానే బాలీవుడ్- టాలీవుడ్ -కోలీవుడ్ హీరోయిన్స్ అందరూ పెళ్లిళ్లు చేసుకుని బ్యాక్ టు బ్యాక్ అభిమానులకి తీపి కబురు అందిస్తున్నారు . కాగా తాజాగా అదే లిస్టులోకి యాడ్ అయిపోయాడు టాలీవుడ్ హీరోగా ఫేమస్ అయిన నవీన్ చంద్ర.

అందాల రాక్షసి సినిమా ద్వారా సినిమా ఇండస్ట్రీలోకి హీరోగా పరిచయమైన నవీన్ చంద్ర.. మంచి టాలెంట్ ఉన్న నటుడు గా పేరు సంపాదించుకున్నాడు. టాలీవుడ్ స్టార్ హీరోస్ అందరూ నవీన్ చంద్ర నటనకు ఫిదా అయిపోతారు. పలు సినిమాలకు సంబంధించిన ఈవెంట్లలో నవీన్ చంద్రను పొగడేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి .కానీ ఆయన అనుకున్నంత స్థాయికి నవీన్ చంద్రఅందుకోలేకపోయాడు. ఈ క్రమంలోనే రూటు మారుస్తూ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు సెలెక్ట్ చేసుకున్నాడు . హీరోగా కంటే విలన్ గానే బాగా యాక్ట్ చేయగలుగుతున్నాడు అన్న కామెంట్లు వినిపించాయి. సైకో పాత్రలు చేస్తున్న నవీన్ చంద్ర రీసెంట్గా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు .

వాలెంటైన్స్ డే సందర్భంగా నవీన్ చంద్ర తండ్రి కాబోతున్న విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు . తన భార్యతో దిగిన బేబీ బంప్ ఫొటోస్ ని షేర్ చేస్తూ అభిమానులతో గుడ్ న్యూస్ పంచుకున్నాడు . ఈ ఫొటోస్ చూస్తుంటే ఆమెకు నిండు నెలలు అని తెలుస్తున్నాయి . రేపో మాపో పాప నో బాబు నో ఎత్తుకోబోతున్నాడు అంటూ తెలుస్తుంది . కాగా నవీన్ చంద్ర చివరిగా రంగ రంగ వైభవంగా, విరాట పర్వం , వీరసింహారెడ్డి లాంటి చిత్రాలలో నటించాడు. అరవింద సమేత చిత్రంలో నవీన్ పోషించిన పాత్రకి మంచి గుర్తింపు దక్కింది. దీంతో నవీన్ చంద్రకు అందరు కంగ్రాట్స్ చెప్పుతున్నారు..!!