పూజా హెగ్డే జాతకంలో చెడు దశ.. అందుకే కొత్త సినిమాలు చేయట్లేదా?

ప్రముఖ నటి పూజా హెగ్డే తన నటనతో, డ్యాన్స్‌తో ఎంతోమంది అభిమానులు సంపాదించుకుంది. అయితే ఈ బుట్ట బొమ్మ మాత్రం హై రెమ్యునరేషన్ వల్ల స్టార్ హీరోయన్‌గా పేరు తెచ్చుకుంది. పోయిన ఏడాది ఈ అమ్మడు రాధే శ్యామ్, ఆచార్య, బీస్ట్, సర్కస్ లాంటి నాలుగు పెద్ద సినిమాలో నటించి ప్రేక్షకులను అల్లరించింది.

ప్రస్తుతం పూజా హెగ్డే త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న SSMB 28 సినిమాలో మహేష్ తో కలిసి నటించనుంది. ఇక హిందీలో ఆమె నటించిన ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ అనే విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ సరసన పూజా హెగ్డే నటించింది. అసలు ఈ బుట్ట బొమ్మ ఈ మధ్య ఏ కొత్త ప్రాజెక్ట్ కి సైన్ చేయడం లేదట. నిజానికి పూజాకి కథ నచ్చితే రెమ్యునరేషన్ తగ్గించుకొని కూడా సినిమాలు చేస్తుంది. కానీ ఇప్పుడు మాత్రం పూజా అసలు దర్శకులు చెప్పే కథ కూడా వినడానికి ఒప్పుకోట్లేదట. ఆమె ఇలా ఎందుకు చేస్తుంది అని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు.

అసలు విషయం ఏంటంటే డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ ఏడాది మే వరకూ ఎటువంటి కొత్త ప్రాజెక్ట్ కి సైన్ చెయ్యొద్దని పూజాకి సలహా ఇచ్చారట. పూజా జాతకం ప్రకారం ఇప్పుడు ఆమె చెడు దశను ఎదుర్కొంటుందని, అంతేకాకుండా గ్రహాల ప్రభావం వల్ల ఆమె జాతకంలో కొన్ని గ్రహ మార్పులు జరిగేంత వరకు ఆమె కొత్త సినిమాలకు ఓకే చెప్పొద్దని త్రివిక్రమ్ సలహా ఇచ్చినట్లు తెలుస్తుంది. అందుకే ఆమె కొత్త ప్రాజెక్ట్స్ తీసుకోవడం లేదట. ఇక పూజా జాతకానికి సంబంధించి రంగు రాళ్ల ఉంగరాలను ధరించే పనిలో ఉందని టాక్ నడుస్తుంది.