ఆ సినిమాతో హీరోయిన్‌కి ఫుల్ క్రేజ్.. హీరో మాత్రం ఫేడౌట్..?!

2021 దసరా పండుగ సందర్భంగా రిలీజ్ అయిన ‘పెళ్ళిసందD’ సినిమాలో శ్రీకాంత్ కొడుకు రోషన్, కన్నడ కథానాయిక శ్రీలీల లీడ్ రోల్స్‌లో నటించారు. ఈ మూవీ స్టోరీ చెత్తగా ఉన్నా రోషన్-శ్రీలీల ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ బాగా పండి బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ అయ్యింది. ఈ సినిమాతోనే హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన శ్రీకాంత్ కొడుకు రోషన్, శ్రీలీల చాలా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ గుర్తింపుతోనే శ్రీలీలకు తెలుగులో వరుస అవకాశాలను చేజిక్కించుకుంటోంది. ఈ ముద్దుగుమ్మ రవితేజతో కలిసి ధమాకా సినిమాలో నటించగా అది సూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో ఈ కన్నడ కుట్టి తన అందం, డ్యాన్స్‌లతో ప్రేక్షకులను కట్టిపడేసింది.

ఈ సినిమా కాక ప్రస్తుతం ఈ తార బాలయ్య సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తోంది. అనగనగా ఒక రాజు, జూనియర్ అనే సినిమాల్లో కూడా ఈ ముద్దుగుమ్మ చేస్తోంది. ధమాకా సినిమాతో హిట్టు కొట్టింది కాబట్టి తెలుగులో ఈ ముద్దుగుమ్మకు మరిన్ని అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంది. తెలుగు డెబ్యూ ఫిలిం ‘పెళ్ళిసంద-డి’తో శ్రీ లీల కెరీర్ మారిపోతే.. హీరో రోషన్ మాత్రం పూర్తిగా కనుమరుగయ్యాడు. ఈ సినిమా వచ్చి సంవత్సరానికి పైగా సమయం గడిచిపోతుంది. అయినా కూడా అతని నుంచి ఒక్క కొత్త సినిమా అనౌన్స్‌మెంట్ కూడా రాలేదు.

21 ఏళ్ల శ్రీలీల కెరీర్ చక్కగా ప్లాన్ చేసుకొని దూసుకెళ్తున్న వేళ ఆమెతో కలిసి ఎంట్రీ ఇచ్చిన శ్రీకాంత్ కొడుకు ఇలా ఫేడౌట్ కావడం నిజంగా ఆశ్చర్యకరమైన విషయమే. ఒక మంచి స్క్రిప్ట్ ఎంచుకోవడానికి సంవత్సరం కంటే అతడు ఎక్కువ సమయం తీసుకుంటున్నాడా? సినిమాల్లో కొనసాగే ఉద్దేశం ఉందా? ఇంత గ్యాప్ తీసుకుంటే ఈ కుర్రాడిని అందరూ మర్చిపోవడం ఖాయం అంటూ చాలామంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా హ్యాండ్సమ్ లుక్స్ ఉండి కూడా రోషన్ తన తండ్రి లాగా సినిమాలలో సక్సెస్ అవుతాడు అన్నది ప్రస్తుతానికైతే ప్రశ్నార్థకమే.