టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గత సంవత్సరం అక్టోబర్ 29న ఎవరు ఊహించని బిగ్ బాంబ్ పేల్చింది. తనకు మయోసైటీస్ అనే వ్యాధి సోకినట్లు సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది. ఇక దీంతో సమంతా అభిమానులు అందరూ ఒక్కసారిగా భయపడిపోయారు. ఆ వ్యాధి గురించి ఏమాత్రం అవగాహన లేకపోవడంతో సమంత పని అయిపోయిందంటూ ఎన్నో రకరకాల వార్తలు కూడా వచ్చాయి.
ఇక అందులో భాగంగా సమంత సినిమాలకు గుడ్ బాయ్ చెప్పేసింది అని.. ఈ వ్యాధి చికిత్స కోసం విదేశాలకు కూడా వెళ్తుందనే ప్రచారం కూడా జరిగింది.
వీటితోపాటు కొందరు సమంతకే సలహాలు ఇవ్వటం కూడా మొదలుపెట్టారు. ఆమెపై ఎన్నో ఫేక్ వార్తలు కూడా పుట్టించారు. ఇక ఇప్పుడు తాజాగా ఓ నేషనల్ మీడియా ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం సమంత మయోసైటీస్ వ్యాధి నుంచి కోలుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సమాచారం తన స్నేహితులు ఆ మీడియాకు అందించారట వీటితో పాటు.. సమంత పై వస్తున్న తప్పుడు వార్తలపై వారు తీవ్రంగా ఖండించారట. సమంత కూడా త్వరలోనే కెమెరా ముందుకు రాబోతుందని చెప్పారట.
ఇక దీంతో పాటు సమంత బాలీవుడ్ సినిమాలకు గుడ్ బాయ్ చెప్పిందన్న వార్తలను కూడా వారి కొట్టి పడేశారు. సమంత త్వరలోనే ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్ లో కూడా నటించబోతుందని. వీటితో పాటు మరికొన్ని బాలీవుడ్ సినిమాలు కూడా తన చేతిలో ఉన్నాయని వారు చెప్పుకొచ్చారు. ఇక టాలీవుడ్లో విజయ్ దేవరకొండకు జంటగా నటిస్తున్న ఖుషి సినిమా దాదాపు 80% షూటింగ్ పూర్తి చేసుకోగా సమంత మరి కొద్ది రోజుల్లోనే ఈ మిగతా 20 శాతం షూటింగ్లో కూడా పాల్గొని సినిమాను పూర్తి చేయాలనుకుంటుందని వారు చెప్పవచ్చారు. ప్రస్తుతం సమంత ఆరోగ్యం గురించి వచ్చిన ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక దీంతో సమంత అభిమానులకు ఈ విషయం తెలియడంతో తెగ సంబరపడిపోతున్నారు.