వారసుడు సినిమా ప్రమోషన్స్ కి విజయ్ డుమ్మా.. తెలుగోళ్లు అంటే అంత చులకనా..?

ఎట్టకేలకు ఇద్దరు టాలీవుడ్ బడా హీరోలకు టఫ్ కాంపిటీషన్ ఇస్తూ కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన వారసుడు సినిమా తెలుగులో రిలీజ్ అయింది. కాగా జనవరి 14న సంక్రాంతి కానుకగా దిల్ రాజు నిర్మించిన వారసుడు సినిమా భారీ సంఖ్యలో సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ ను సంపాదించుకుంది . మొదటి నుంచి హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న ఈ సినిమా పై కొందరు జనాలు పాజిటివ్గా నచ్చితే.. మరి కొందరు జనాలకు నెగిటివ్గా అనిపిస్తుంది .

సినిమాలో పెద్దగా కంటెంట్ లేకపోవడం ఒక మైనస్ అయితే.. కొందరు జనాలు అన్ని సినిమాలను మిక్స్ చేసి ఈ సినిమా తీశారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు . అంతేకాదు సినిమాలో విజయ్ పర్ఫామెన్స్ తప్పిస్తే చెప్పుకోతగా ప్లస్ పాయింట్స్ ఏమీ లేవు అంటూ ట్రోల్ చేస్తున్నారు. అయితే వారసుడు సినిమా ప్రమోషన్స్ కి తెలుగులో విజయ్ ఎందుకు రాలేదు అన్న ప్రశ్న ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది ..?.

కోలీవుడ్ లో తన సినిమాకి హ్యూజ్ రేంజ్ లో ప్రమోషన్స్ చేసిన విజయ్ తెలుగులో మాత్రం ఎక్కడ ఒక్క మీడియా ఛానల్ కి కూడా ఇంటర్వ్యూ ఇవ్వలేదు . ఇదే క్రమంలో తెలుగోళ్ళు అంటే ఆయనకి అంత చులకన అంటూ జనాలు ఫైర్ అవుతున్నారు . అందుకే ఈ సినిమా దొబ్బేసింది అన్న టాక్ కూడా బలంగా వినిపిస్తుంది . ఏది ఏమైనా సరే దిల్ రాజుకు వారసుడు సినిమాతో భారీ బొక్క తప్పదు అని మాత్రం జనాలు క్లారిటీ ఇస్తున్నారు. చూడాలి మరి దిల్ రాజు ఇలాంటి కామెంట్స్ పై ఏ విధంగా స్పందిస్తారో..?