అన్ని ఉన్న అదా శర్మలో ఆ ఒక్కటే తక్కువ.. అందుకే స్టార్స్ టెంప్ట్ కాలేకపోతున్నారా..?

సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది ముద్దుగుమ్మలు హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చి తమ అందచందాలతో కుర్రాలను టెంప్ట్ చేసి మెల్ట్ చేసి స్టార్ హీరోయిన్గా చలామణి అవుతున్నారు. అయితే అందం ఉన్న ప్రతి హీరోయిన్ స్టార్ హీరోయిన్గా మారుతుందా అంటే ..? నో అనే చెప్పాలి . దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఆదాశర్మ. పేరుకు కొత్త పరిచయాలు అవసరం లేదు. పలు తెలుగు , హిందీ సినిమాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న ఆదాశర్మ .

తెలుగులో స్టార్ హీరో అయిన బన్నీ , నితిన్ లాంటి వాళ్ల తో కూడా జతకట్టి మెప్పించింది . అయితే సినిమాల పరంగా హిట్స్ అందుకున్న ఆదాశర్మ .. మంచి నటిగా మాత్రం గుర్తింపు సంపాదించుకోలేకపోయింది . అంతేకాదు అందం పరంగా మెప్పించిన ఆదాశర్మ .. నటన పరంగా మాత్రం డిజాస్టర్ అనే టాక్ ను దక్కించుకుంది. ఆమె నటించిన అన్ని సినిమాలు చూసినట్లయితే.. అందం పరంగానే జనాలు ఆమెకు ఓట్లు వేశారు.

కానీ నటన పరంగా ఎక్కడ అదా శర్మ అట్రాక్ట్ చేయలేదు. ఈ క్రమంలోనే స్టార్ హీరోస్ కూడా ఆమెను సినిమాలోకి తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూయించలేదు అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపించాయి . ఆ కారణంగానే హిట్స్ అందుకున్నా కానీ ఆదాశర్మ ప్రజెంట్ అవకాశాలు లేక సోషల్ మీడియాకే పరిమితమైంది అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో మాత్రం తగ్గేదేలే అన్న రేంజ్ లో అందాలు ఆరబోస్తూ ఉంటుంది..!!