నితిన్ ఈ రెండు విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటే.. హిట్ కొట్టడం ఖాయం..

జయం, దిల్, సై సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్న నితిన్ ఆ తర్వాత హిట్స్ కొట్టడానికి చాలా కష్టపడ్డాడు. బాక్సాఫీస్ వద్ద వరుస పరాజయాల తర్వాత, ఇష్క్ (2012)తో విజయం సాధించాడు. గుండె జారి గల్లంతయ్యిందే (2013), హార్ట్ ఎటాక్ (2014), అ ఆ (2016), భీష్మ (2020) ఇలా అతడి కెరీర్‌లో అడపాదడపా హిట్స్ వచ్చాయి తప్ప కంటిన్యూగా హిట్స్ పడలేదు. అతను 2021లో తీసిన చెక్, రంగ్ దే, మాస్ట్రో, 2022లో చేసిన మాచర్ల నియోజకవర్గం సినిమాలు అట్టర్ ఫ్లాప్స్ అయ్యాయి. అలా బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్ వస్తుండటంతో నితిన్ కెరీర్ పెద్ద రిస్క్ లో పడిపోయింది.

ఇప్పుడు నితిన్ వక్కంతం వంశీ దర్శకత్వంలో ఒక సినిమా, వెంకీ కుడుముల దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు ఒప్పుకున్నాడు. వెంకీ కుడుములతో భీష్మ సినిమా చేసి హిట్ అందుకున్న నితిన్ ఎప్పుడు అతనే తనకు మళ్లీ ఒక హిట్ తెచ్చి పెడతాడని బాగా నమ్ముతున్నాడు. ఏది ఏమైనా నితిన్ తన సినిమాల్లో కామెడీ, స్టోరీ ఈ రెండూ బాగుండేలా జాగ్రత్తగా చూడాలి. అలాగే సినిమాను ఆసక్తికరంగా మలచగల డైరెక్టర్ కూడా అతనికి అవసరం. లేదంటే అతడి కెరీర్‌కి ఎండ్‌ కార్డు పడుతుంది. ప్రస్తుతం చేస్తున్న వక్కంతం వంశీ సినిమా, వెంకీ కుడుముల సినిమాలు ఇలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ కి వస్తున్నాయో లేదో తెలియదు కానీ అతడికి మాత్రం సక్సెస్ రావాల్సిన అవసరం ఉంది.

ఇకపోతే ప్రస్తుతం సినీ సర్కిల్ నడుస్తున్న టాక్ ప్రకారం మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మాణంలో వెంకీ కుడుముల డైరెక్షన్‌లో నితిన్‌, రష్మిక హీరో, హీరోయిన్లుగా సినిమా వస్తోంది. భీష్మలో నితిన్ తో కలిసి జత కట్టిన రష్మిక ఈ సినిమాలోనూ కలిసిన నటించనుందని వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో నిజం ఎంతో తెలియాలి అంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.