వాట్..సాయి పల్లవి ఆ తెలుగు హీరోని సాటిస్ఫై చేసిందా..?

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్లు ఉన్నా సరే ..ఎక్స్పోజింగ్ చేయని సాయి పల్లవి అన్న పేరు చెప్పగానే జనాలు పూనకాలు వచ్చినట్టు ఊగిపోతారు . ఇలాంటి స్టార్ స్టేటస్ ఎక్కువ హీరోలకే అందుతుంది . కాగా తెలుగు ఇండస్ట్రీలో ఫస్ట్ టైం ఓ లేడీ పవర్ స్టార్ ట్యాగ్ ని తన పేరుకి అటాచ్ చేయించుకుని ..మరి సినిమా ఇండస్ట్రీలో దూసుకుపోతుంది. సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సాయి పల్లవి ఆ తర్వాత ఫిదా అనే సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది.

మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న సాయి పల్లవి ..ఆ తర్వాత తన కెరీర్ లో హిట్లు ఫ్లాపులు అంటూ తేడా లేకుండా దూసుకుపోయింది. అయితే ఆమె నటించిన లాస్ట్ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచాయి . ఈ క్రమంలోనే ఆచి తూచి నిర్ణయాలు తీసుకుంటున్న సాయి పల్లవి.. గతంలో తెలుగు హీరోని సాటిస్ఫై చేసింది అన్న రూమర్లు ఎక్కువుగా వినిపించాయి.

తెలుగు హీరో నాగ శౌర్యతో “దియా” సినిమాలో కలిసి నటించింది సాయి పల్లవి. ఈ సినిమా టైంలో సాయి పల్లవి పై నాగశౌర్య సంచలన కామెంట్స్ చేశారు. ఆమెకు ఈగో అని ..హెడ్ వెయిట్ అని.. టైం కి సెట్స్ కి రాదు అంటూ ఓపెన్ గా చెప్పారు . ఈ క్రమంలోనే సాయి పల్లవి తన సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ..”నా వల్ల ఎవరైనా హర్ట్ అయ్యి ఉంటే.. నిజంగా నేను క్షమాపణలు కోరుతున్నానని ..నేను కావాలని ఏది చేయలేదని” చెప్పుకొచ్చింది. దీంతో సాయి పల్లవి అతగాడి ఈగోని సాటీస్ఫై చేసింది అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి. దీంతో ఆ వివాదానికి ఎండ్ కార్డ్ పడ్డింది..!!