వెంకటేష్ మైల్ స్టోన్ 75వ సినిమా నుంచి.. అదిరిపోయే అప్డేట్ ఫ్రీ లుక్ చించేసాడుగా..!

టాలీవుడ్ సీనియర్ హీరోల‌లో ఒకరైన విక్టరీ వెంకటేష్ తన కెరీర్‌లో మైల్ స్టోన్ చిత్రం 75వ సినిమా అప్డేట్ తాజాగా వచ్చింది. ఎఫ్ 3 సినిమా తర్వాత వెంకటేష్ నుంచి వస్తున్న సినిమా ఏంటి అంటూ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో నానితో శ్యామ్ సింగరాయ్‌ నిర్మించిన నిహారిక ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై వెంకీ 75వ సినిమా రాబోతున్నట్లు ఈరోజు అధికారికంగా ప్రకటించారు.

Venkatesh: శైలేష్‌తో సినిమాను ఆ రోజున స్టార్ట్ చేస్తోన్న వెంకీ..? - 10TV Telugu

ఈ సినిమాకు ఎప్పటినుంచో అనుకుంటున్నా హిట్ ఫెమ్ దర్శకుడు శైలేష్ కొలను పేరు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఇక ఈ సినిమా ఫ్రీ లుక్ కూడా ఈరోజు విడుదల చేశారు. ఆ పాస్టర్ కూడా వెంకీ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. శైలేష్ కొలను చెప్పిన స్టోరీ కూడా వెంకీ తో పాటు దగ్గుపాటి ఫ్యామిలీకి కూడా ఎంతో బాగా నచ్చడంతో త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టేందుకు రంగం సిద్ధమైందని తెలుస్తుంది.

ఈ సినిమాకు సంబంధించి మరిన్ని తాజా అప్డేట్స్ కూడా రిపబ్లిక్ డే కానుకగా ఈ సినిమా యూనిట్ ప్రకటించబోతున్నట్లు కూడా చెప్పుకొచ్చారు. హిట్ మరియు హిట్ 2 సినిమాలతో దర్శకుడు శైలాష్ కొలను మంచి పేరు దక్కించుకున్నాడు. ఇప్పటికే నానితో హిట్ 3 సినిమాను చేసేందుకు కమిటీ అయ్యాడు. నాని కూడా ప్రస్తుతం వరుస‌ సినిమాలతో బిజీగా ఉండగా దింతో నాని సినిమా స్టార్ట్ అయ్యేలోపు వెంకటేష్ తో ఆయన మైల్ స్టోన్ సినిమాను తెరకెక్కించేందుకు దర్శకుడు శైలాష్ రెడీ అయ్యాడు.

వెంకీ 75 ప్రీ లుక్ అదుర్స్.. | Venkatesh 75th Movie Pre Look Adurs, , Venkatesh , 75th Movie , Pre Look , Tollywood, Sailesh - Telugu Niharika, Shailesh, Tollywood, Venkatesh

సాధారణంగా ఎలాంటి దర్శకుడికైనా వెంకటేష్‌తో సినిమా అంటేనే గొప్ప ఛాలెంజ్ లాంటిది.. అలాంటిది ఆయన కెరీర్ లో 75వ సినిమా అంటే ఏ స్థాయిలో దర్శకుడు పై ఒత్తిడి ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు.వెంకటేష్ అభిమానులతో పాటు ప్రతి సగటు సిని ప్రేక్షకుడు కూడా ఎంతో ఆసక్తిగా ఉంటారు. మరి ఈ దర్శకుడు తన హిట్ సెంటిమెంట్ ని కొనసాగిస్తూ వెంకీకి 75వ సినిమాను ఆయన కెరీర్ లోనే గుర్తుండిపోయే హిట్ ఇస్తాడా అనేది చూడాలి.