బాలయ్య కోసం ఆ మెగా డైరెక్టర్ రెడీ.. స్టేజ్ మీదే స్టోరీ చెప్పేసాడుగా..!

చిత్ర పరిశ్రమలో ఎప్పుడు ఏం జరుగుతుందో? ఎవరు ఊహించని కాంబినేషన్లు ఎలా సెట్ అవుతాయో ఎవరూ చెప్పలేరు. ఇప్పుడు అలాగే నట సింహం నందమూరి బాలకృష్ణ తో ఓ డైరెక్టర్ సినిమా చేయడానికి ఉర్రూతలు ఊగుతున్నాడు. ఇప్పటికే ఆ డైరెక్టర్ తో సినిమా కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తుంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా కోసం దాదాపు మూడు సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న దర్శకుడు హరీష్ శంకర్.

చివరికి గత సంవత్సరం చివరలో ఆ సినిమాకు కొబ్బరికాయ కూడా కొట్టారు. అయితే ఇప్పుడు ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందో అనేది ఎవరికీ తెలియని అంతుచిక్కని ప్రశ్నగా మారింది. ఈ క్రమంలోనే బాలయ్య మైత్రి మూవీస్ బ్యానర్ లో వీర సింహారెడ్డి సినిమాతో అదిరిపోయే హీట్ అందుకున్నాడు. ఇక తాజాగా ఈ సినిమా సక్సెస్ మీట్ కూడా హైదరాబాద్‌లో ఎంతో గ్రాండ్ గా జరిగింది.

Harish Shankar to Direct Balakrishna

ఈ ఫంక్షన్‌కు హరీష్ శంకర్ కూడా ముఖ్య అతిథిగా వచ్చాడు. అతను అక్కడ తన మనసులోని మాటను బయటపెట్టాడు. బాలయ్యతో ఒక సినిమా చేయాలనేది తన కల అంటూ అక్కడ ఉన్న వేదిక మీద ప్రకటించాడు. అక్కడితో ఆగకుండా త్వరలోనే మంచి కథతో మీ దగ్గరికి వచ్చి ఒప్పిస్తానంటూ బాలయ్యకు చెప్పేశారు. ఇక నేను బాలయ్య తో చేసే సినిమాకు కూడా మైత్రి మూవీస్ వారే నిర్మాతలుగా ఉండాలి అంటూ తన మనసులోని మాటను బయటపెట్టాడు.

హరీష్ చూపు..బాలయ్య వైపు

బాలయ్య బాబు అభిమానులు ఎలాంటి ఎలిమెంట్స్ కోరుకుంటున్నారో అలాంటి స్టోరీ తో వస్తాను అంటూ తన ప్రసంగాన్ని ముగించాడు. మైత్రి మూవీస్ తో పవన్ కళ్యాణ్- బాలయ్య సినిమా కూడా కమిట్ అయినట్లు క్లారిటీ ఇచ్చేశాడు. బాలయ్య సినిమా కూడా త్వరలోనే స్టేట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తుంది