స్టార్ హీరోల అభిమానుల చిల్లర ప్రవర్తన… ఒళ్ళు కొవ్వేక్కితే ఇలాగే ఉంటుంది!

మనదగ్గర ఫ్యాన్ వార్స్ ఏ విధంగా వుంటాయో చెప్పాల్సిన పనిలేదు. ఇకపోతే గతంతో పోల్చుకుంటే నేటి యూత్ పెచ్చుమీరుతున్నారు. మన టాలీవుడ్లో పెద్ద హీరోల మధ్య ఎలాంటి స్నేహ పూర్వక వాతావరణం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వారి స్నేహాన్ని వారు బాహాటంగానే ప్రదర్శించడం మనం చాలాసార్లు చూశాం. అది చూసి కూడా సో కాల్డ్ హీరోల అభిమానులు మారకపోవడం దురదృష్టకరం.

నేటి టాప్ యంగ్ హీరోలు అయినటువంటి జూనియర్ NTR, ప్రభాస్, చరణ్, అల్లు అర్జున్ ల హవా మొదలైన నాటినుండి సోషల్ మీడియా వార్స్ స్టార్ట్ అవ్వడం చూస్తూ వున్నాం. ఇప్పుడు లేటెస్ట్ గా విడుదలైన ‘వాల్తేర్ వీరయ్య’ ‘వీరసింహా రెడ్డి’ మూవీలకు సంబంధించిన హీరోలు కూడా సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోతున్నారు. ఈ రెండు సినిమాలకు డివైడ్ టాక్ వచ్చినప్పటికీ ఈ రెండు సినిమాలు కలక్షన్స్ పరంగా ఊహించని విజయం సాధించాయి అన్న విషయం అందరికీ తెలిసినదే.

ఇక అదే పాయింట్ మీద మనవాళ్ళు సోషల్ మీడియా వేదికగా తెగ కొట్టేసుకుంటున్నారు. కొన్ని చోట్ల అయితే ఈ సినిమాల కలక్షన్స్ పడిపోకుండా ఈ ఇద్దరి హీరోల సామాజిక వర్గాలలోని అభిమానులు తమ సొంత డబ్బుతో టిక్కెట్లు కొని సంక్రాంతి సమయంలో వాటికి సంబంధించిన ప్రతి షోకి హౌస్ ఫుల్ బోర్డ్ పడేలా ప్రయత్నించారు అని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ వార్తలే గాని నిజం అయితే మనవాళ్ళకి కొవ్వు పట్టింది అనడంలో సందేహమే లేదు. ఆయా సినిమాల ప్రీ రిలీజ్ ఫంక్షన్లో హీరోలు ఎంత బాధ్యతతో మాట్లాడారో అందరికీ తెలిసిందే. ఒకరి సినిమా హిట్ అవ్వాలని ఒకరు చాలా మర్యాదపూర్వకంగా కోరుకున్నారు. కానీ తలాతోకాలేని ఈ అభిమానులు ఇలా ప్రవర్తిస్తున్నారేమిటి అని కొంతమంది పెదవి విరుస్తున్నారు.