నక్క తోక తొక్కిన కాంతారా హీరోయిన్‌.. బాలీవుడ్‌లో అదిరిపోయే ఆఫర్లు??

 

హీరో రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన కన్నడ సినిమా ‘కాంతార’ విడుదల అయిన ప్రతీ చోట ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కాంతార సినిమాతో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి సప్తమి గౌడ. ఈ సినిమా హిట్ తో సప్తమి ఇతర భాషలో కూడా మూవీ ప్రాజెక్ట్స్ కీ ఓకే చెప్పేస్తుంది. బాలీవుడ్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి తెరకేక్కిస్తున్న ‘ది వ్యాక్సిన్ వార్’ అనే సినిమాలో సప్తమి గౌడ కీలక పాత్రలో నటించబోతుంది.

ఈ సందర్బంగా ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘వివేక్ సార్ ‘కాంతార’ సినిమా చూసి రిషబ్ శెట్టికి ఫోన్ చేసి నా నెంబర్ తీసుకొని నాకు ఫోన్ చేసారు. నేను ఒక సినిమా తీస్తున్నాను.. అందులో నువ్వు నట్టిస్తే చాలా బాగుంటుంది అని అన్నారు.’ అని ఆమె చెప్పింది. సప్తమి ఇంకా మాట్లాడుతూ “ఆయన మాటలు వినగానే నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఇక ఏమీ ఆలోచించకుండా వెంటనే ఆ ప్రాజెక్ట్ కి ఓకే చెప్పేసాను…”

“దాంతో వివేక్ గారు నాకు ‘ది వ్యాక్సిన్ వార్ ‘ సినిమాలో నా పాత్ర గురించి వివరించారు. ఈ సినిమా తో నేను బాలీవుడ్ లోకి అడుగు పెడుతునందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. వివేక్ గారు భాష పరంగా నాకు చాలా హెల్ప్ చేస్తున్నారు. నాకు ఇతర భాషలలో నటించడం ఇష్టమే కానీ నా మొదటి ప్రాధాన్యత మాత్రం కన్నడ సినిమాలకే ఇస్తాను” అని కుండ బద్దలు కొట్టింది.

కాంతారా సినిమాలో సప్తమి తన గ్రామం పట్ల తన విధి, బాధ్యతల మధ్య చిక్కుకున్న ఫారెస్ట్ ఆఫీసర్ పాత్రను పోషించింది. కాగా కాంతారా విడుదలకు ముందే ది వ్యాక్సిన్ వార్ సినిమా కోసం డైరెక్టర్ తనను సంప్రదించినట్లు ఆమె వెల్లడించింది. వివేక్‌ను అద్భుతమైన దర్శకుడు అని పిలిచిన సప్తమి, అతని నుంచి, అతని భార్య పల్లవి జోషి నుంచి తాను చాలా నేర్చుకున్నానని చెప్పింది.