అలనాటి హీరోయిన్ అంజలీదేవి మనవరాలు ఇప్పుడొక స్టార్ యాక్టర్..!

ఒకప్పటి నటి అంజలీదేవి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆమె తన అందమైన రూపంతో, అద్భుతమైన నటనతో ఎంతోమంది అభిమానుల మనసు గెలుచుకుంది. మొదటిగా ఆమె చిన్న పాత్రలతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. అంజలీదేవి నటించిన ‘లవకుశ’ సినిమాలో ఆమె సీత పాత్రలో నటించింది. ఆ పాత్రతో ఆమె ఎంతోమంది మహిళల మనసులో నిలిచిపోయింది. ఇక అప్పటినుంచి అంజలీదేవి స్టార్ హీరోయిన్‌గా మారింది.

లవకుశ సినిమా తర్వాత నుంచి అంజలీదేవి ఎక్కడికి వెళ్ళినా కూడా ఆమెను అచ్చం సీత లానే ఉన్నావని చాలామంది పొగిడేవారట. అయితే ఆమె హీరోయిన్ గానే కాకుండా నిర్మాతగా కూడా ఎన్నో సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఇలా అంచెలంచెలుగా ఎదుగుతున్న అంజలీదేవి, సంగీత దర్శకుడు అయిన ఆదినారాయణరావుని వివాహం చేసుకుంది. ఇక ప్రస్తుతం అంజలీదేవి వారసత్వాన్ని కొనసాగించడానికి ఆమె మనవరాలు ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా అడుగు పెట్టింది. కానీ ఈ విషయం చాలా మందికి తెలీదు.

అయితే అంజలి వారసత్వాన్ని కొనసాగిస్తున్న ఆ హీరోయిన్ ఎవరో కాదు ‘ఇండియన్ బ్యూటీ’ అనే మూవీలో హీరోయిన్ గా నటించిన సైలా రావు. సైలకి సినిమాలపై ఎక్కువగా ఇష్టం ఉండటంతో తన చదువు పూర్తవగానే యాక్టింగ్‌లో ట్రైనింగ్ తీసుకుంది. ఇక ఆ తరువాత ఇండియన్ బ్యూటీ అనే సినిమాతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి ఆస్ట్రీచ్ పార్క్, టుడే స్పెషల్ అనే సినిమాల్లో నటించింది. అంతేకాకుండా నిర్మాతగా కూడా కొన్ని సినిమాలను తెరకెక్కించింది. అంజలీదేవి వారసత్వాన్ని నిలబెడుతూ సైల రావు కూడా హీరోయిన్‌గా, నిర్మాతగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది.