‘వీరసింహారెడ్డి’ పబ్లిక్ టాక్: సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అదే.. కుమ్మేసావ్ బాలయ్య..!!

నందమూరి హీరోలు ఎంతో ఆశగా ఈగర్ గా వెయిట్ చేస్తున్న బాలయ్య నటించిన సినిమా వీర సింహారెడ్డి . మల్టీ టాలెంటెడ్ గోపీచంద్ డైరెక్షన్ లో తెర కెక్కిన ఈ సినిమా కొద్దిసేపటి క్రితమే బాక్సాఫీస్ వద్ద రిలీజ్ అయ్యి హ్యూజ్ బిగ్గెస్ట్ పాజిటివ్ టాక్ చేస్తుంది . మనకు తెలిసింది బాలయ్య సినిమా అంటే జనాలు ఫస్ట్ గా ఎక్స్పెక్ట్ చేసేది మాస్ యాంగిల్ ..తొడ కొట్టడాలు.. గొడ్డలి పట్టుకొని నరకడాలు.. మీసం మెలివేయడాలు. అఫ్ కోర్స్ బాలయ్యలో ఈ మూడు యాంగిల్స్ చాలా సూపర్ గా ఉంటాయి . ఇలా ఏ హీరోలు చేసిన పెద్ద గా జనాలు లైక్ చేయరు .

 

కానీ బాలయ్య చేస్తే మాత్రం థియేటర్స్ లో ఫ్యాన్స్ పూనకాలు వచ్చినట్లు ఊగిపోతూ ఉంటారు . ఆ బాడీకి అలాంటి పవర్ఫుల్ పవర్ ఉంది . సినిమాలో గోపీచంద్ ఆ పవర్ ని బాగా వాడుకున్నాడు . నందమూరి బాలయ్యను ఎక్కడ ఎలా ఏ ఆంగిల్ లో పెట్టి చూపిస్తే జనాలు ఫిదా అవుతారో..? పూనకాలు వచ్చినట్లు ఊగిపోతారో..? వాళ్ళ నాడి పట్టేసిన గోపీచంద్ మల్లినేని పర్ఫెక్ట్ గా అలాంటి ఓ డైరెక్షన్ తో మన ముందుకు వచ్చాడు . అంతేకాదు ఈ సినిమాకి మరో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ తమన్ మ్యూజిక్. హీరోలు ఎంత కష్టపడినా ఎంత ట్రై చేసినా సరైన మ్యూజిక్ పడకపోతే అన్ని ఐటమ్స్ ఉన్నా సరే చెప్పగా ఉన్న కూర లాగే తయారవుతుంది.. అయితే తమన్..బాలయ్య సినిమాకి మాత్రం తమ ప్రాణం పెట్టి మ్యూజిక్ కంపోజ్ చేశాడని చెప్పాలి .

ప్రతి సీన్ లోను ప్రతి షార్ట్ లోను ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ థియేటర్స్ లో ఫ్యాన్స్ కు ఊపు తెప్పిస్తుంది . అంతేకాదు ఇదివరకే బాలయ్య – తమన్ కాంబోలో వచ్చిన అఖండ ఎంత బ్లాక్ బస్టర్ హీట్ అయిందో తెలిసిందే. దానికి ట్రిపుల్ రేంజ్ లో కష్టపడుతూ థియేటర్స్ లో బాలయ్య ఫ్యాన్స్ కు ప్రత్యేక పూనకాలు తెప్పించాడు తమన్ తన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో అని చెప్పడంలో అతిశయోక్తి లేదు . అంతేకాదు మరీ ముఖ్యంగా మాస్ మొగుడు.. సుగుణసుందరి సాంగ్ వస్తున్నప్పుడు థియేటర్స్ లో ఫ్యాన్స్ తమ సీట్లలో కూర్చోకుండా ఎగిరి ఎగిరి గంతులు వేస్తూ కేకలతో థియేటర్స్ దద్దరిల్లిపోతున్నాయి. సినిమా సూపర్ డూపర్ హిట్ టాక్ ని సంపాదించుకుంది. చూడాలి మరి కలెక్షన్స్ పరంగా వీరసింహారెడ్డి ఎలాంటి రికార్డ్స్ ను క్రియేట్ చేస్తుందో బ్రేక్ చేస్తుందో..?