ఏపీ రాజకీయాలపై స్పందించిన చిరంజీవి..!!

మెగాస్టార్ చిరంజీవి ఇటీవలే గాడ్ ఫాదర్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు తాజాగా వాల్తేరు వీరయ్య చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఎన్నో సంవత్సరాల తర్వాత మాస్ యాక్షన్ సినిమాలో నటించారు. చిరంజీవి ఈ చిత్రాన్ని డైరెక్టర్ బాబి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం జనవరి 13వ తేదీన విడుదల కాబోతోంది.ప్రస్తుతం ఈ సినిమా కార్యక్రమంలో బిజీగా ఉన్న చిరంజీవి ఇటీవలే తనపై వచ్చిన కొన్ని కామెంట్స్ పైన రియాక్ట్ కావడం జరిగింది వాటి గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Megastar Chiranjeevi Interview About Waltair Veeraya, Shares Interesting  Things About Movie

ఇక చిరంజీవి పై వచ్చిన కామెంట్లపై రియాక్ట్ అవుతూ అలాగే ఏపీ రాజకీయాల పైన స్పందించారు. చిరంజీవి మాట్లాడుతూ ముఖ్యంగా పొరుగు రాష్ట్రాలలో రాజకీయాల పైన నాకెందుకు అని తెలియజేశారు ఆ రాజకీయాలు నాకు వద్దంటూ కూడా కుండబద్దలు కొట్టేశారు. నాకు ఏపీ పొలిటికల్స్ కు సంబంధం లేదు అక్కడ ఏం జరుగుతుందో పేపర్ల ద్వారా మీకు ఏం తెలుస్తుందో మీరు పరిశీలిస్తారు. అంతకంటే తక్కువ పరిశీలిస్తాను అంటూ తెలియజేశారు. అంతేకాకుండా తన ఇంటికి అసలు పేపర్లు రావని నా ఫోకస్ మొత్తం సినిమా అని తెలియజేశారు. రాజకీయాల గురించి అసలు పట్టించుకోనని కూడా తెలియజేశారు.

ముఖ్యంగా తనకు ఓటు హక్కు ఎక్కడ ఉందో ఆ రాష్ట్రంలో ఉండి మాట్లాడతాను.. నాకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదు అని తెలియజేశారు.మా ఇంట్లో మరొక వ్యక్తి రాజకీయాలలోకి వెళ్ళకూడదని అనుకోను పొలిటికల్ లోకి వెళతాను అనేది తన ఇష్టం తను ఇండిపెండెంట్ అయిన వ్యక్తి పవన్ నా తమ్ముడు తన రాజకీయాలకు నేను ఉన్నానని అనుమానాలు చాలా ఉన్నాయి.. నేను ఎన్నోసార్లు చాలా క్లియర్ గా చెప్పాను అయినా నా పేరు వినిపిస్తూనే ఉంది. నాకు రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు చిరంజీవి.