Trailer: అదరగొడుతున్న వారసుడు ట్రైలర్..?

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి నటించిన వారిసు సినిమా తెలుగులో వారసుడు అనే సినిమా పేరుతో డబ్ చేసి విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా ఒకేసారి తెలుగు, తమిళంలో విడుదల చేయబోతున్నారు. అందుచేతనే ట్రైలర్ను కూడా ఆన్లైన్లో ఒకేసారి విడుదల చేయడం జరిగింది. ఈ సినిమా ఫ్యామిలీ ఎమోషనల్ లవ్ యాక్షన్ ఇలా అన్నిటిని ఈ సినిమాలో చూపించబోతున్నట్లు ట్రైలర్లో చూపించారు. అయితే ఇప్పటివరకు ఈ సినిమాలో వచ్చిన అనేక తెలుగు సినిమాల సన్నివేశాలు కూడా కనిపిస్తున్నట్లు తెలుస్తోంది.

Varisu' Tamil Movie Official Trailer | Thalapathy Vijayమరి ఈ సినిమాలో హీరోయిన్గా రష్మిక నటిస్తోంది. డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తూ ఉండగా నిర్మాతగా దిల్ రాజు వ్యవహరిస్తున్నారు. దీంతో సంక్రాంతి బరిలో విడుదల కాబోతున్న ఈ సినిమా ఎలా ఉండబోతోంది అంటూ విజయ్ అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాకి సంగీతాన్ని ఎస్ఎస్ తమన్ అందిస్తున్నారు. గడచిన కొద్ది రోజుల క్రితం ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కూడా తమిళంలో చాలా భారీగా జరిగింది. తెలుగులో ప్రమోషన్ కు హీరో విజయ్ రాలేదు అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక సంక్రాంతి బరిలో చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాలతో వారసుడు సినిమా పోటీ పడనుంది. హీరో విజయ్ కెరియర్ మొదలుపెట్టి ఇప్పటికి 30 సంవత్సరాలు పైనే అవుతోంది. తెలుగు థియేటర్ రైట్స్ వారసుడు కాకుండా మిగతా రైట్స్ అన్ని కలుపుకొని దాదాపుగా ఈ సినిమాని రూ.280 కోట్ల రూపాయలకు ఇచ్చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ఈ సినిమాకి దాదాపుగా రూ.250 కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నట్లు సమాచారం. దీంతో దిల్ రాజు కేవలం రూ .30 కోట్ల లాభానికి ఈ సినిమా అమ్మేసినట్లు తెలుస్తోంది అయితే తెలుగు రైట్స్ మాత్రం తన దగ్గరే ఉన్నట్లు ట్రెండ్ వర్గాలు తెలియజేస్తున్నాయి.