ప్రభాస్‌తో చేతులు కలపనున్న ఆ స్టార్ హీరో.. ఇక బాక్సాఫీస్ బద్దలే!!

ప్రస్తుతం కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న ‘సలార్’ మూవీ చివరి దశకు వచ్చేసింది. ఈ సినిమాలో మన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్నాడు. మరో వైపు అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ‘స్పిరిట్’ మూవీ షూటింగ్ మొదలు పెట్టే పనిలో ఉన్నారు. ఇక ప్రభాస్ నటిస్తున్న ఇంకో సినిమా ప్రాజెక్ట్ K షూటింగ్ కూడా శరవేగంగా నడుస్తుంది. అలానే ఆదిపురుష్ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయిపోయింది. కాబట్టి ఈ సినిమాలు అన్ని ఈ ఏడాది అంటే 2023, 2024లలో ప్రేక్షకుల ముందుకు వస్తాయి. ఈ గ్యాప్ లో మారుతీ డైరెక్షన్‌లో ఒక సినిమా చేస్తున్నాడు ప్రభాస్. ఇవన్నీ పక్కన పెడితే, ప్రభాస్ మైత్రి మూవీస్ మేకర్స్ నిర్మాణ సంస్థలో చేయబోయే సినిమా గురించి మాత్రం తప్పకుండా చెప్పుకోవాలి.

మైత్రి మేకర్స్ సంస్థ బాలీవుడ్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ప్రభాస్ ని హీరోగా తీసుకొని భారీ బడ్జెట్‌తో ఒక సినిమా ని ప్లాన్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రాజెక్ట్ ఎప్పుడో ఓకే చేసేసారు. కానీ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ మాత్రం ఇంకా ఇవ్వలేదు. అసలు విషయం ఏంటంటే ప్రభాస్, సిద్ధార్థ్ కాంబినేషన్లో వచ్చే సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో హ్రీతిక్ రోషన్ కూడా నటించబోతున్నట్లు సమాచారం. అసలు విరిద్దరు కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటే ఆడియన్స్ కి కన్నుల పండగే.

అయితే ఆనంద్ సిద్ధార్థ్, ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమా లో హృతిక్ రోషన్ ని నటించేందుకు చర్చలు చేస్తున్నారట. ఒకవేళ హృతిక్ ఓకే అంటే మాత్రం ఆనంద్ సిద్ధార్థ్ సినిమా ఎవరూ ఊహించని రేంజ్ కి వెళ్ళిపోతుంది.