పెళ్లి చేసుకోబోతున్న హీరోయిన్ సదా.. భర్త ఎంత రిచ్‌ అనేది తెలిస్తే..!!

గత ఐదారు నెలల నుంచి ఇండస్ట్రీలో పెళ్లిళ్ల హడావిడి ఎక్కువగా నడుస్తుంది. ఎప్పటినుంచో బ్యాచిలర్స్‌గా ఉన్న నటీనటులు ఇప్పుడు పెళ్లిపీటలు ఎక్కుతున్నారు. టాలీవుడ్ హీరో శర్వానంద్ ఇటీవలే రక్షిత రెడ్డితో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. ఇక ఇప్పుడు ఇంకో సీనియర్ హీరోయిన్ పెళ్లిపీటలు ఎక్కబోతుందనే వార్తలు వస్తున్నాయి. అయితే ఆ సీనియర్ హీరోయిన్ మరెవరో కాదు ‘సదా ‘.

‘జయం’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సదా చాలా తక్కువ సమయంలోనే కుర్రాళ్ల కలల రాణిగా పేరు సంపాదించుకుంది. ఈ అమ్మడు తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా స్టార్ హీరోల సరసన నటించింది. స్టార్ హీరోయిన్‌గా ఎన్నో సినిమాలో నటించిన సదా కొంతకాలం గ్యాప్ తీసుకుంది. ఇక ఇటీవలే బుల్లితెర పై ప్రోగ్రామ్స్ లో జడ్జిగా రీఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దు గుమ్మ.

ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో ఒక్క సినిమా కూడా లేదు కానీ బుల్లితెరపై మాత్రం దూసుకెళ్తుంది. ఈ తార బీబీ జోడి కి జడ్జ్ గా వ్యవహరిస్తోంది. ఇటీవలే హలో వరల్డ్ అనే వెబ్ సిరీస్ లో కూడా యాడ్ చేసింది. ఈ నేపథ్యంలోనే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన సదా ఆమె మనసుకి నచ్చినవాడు దొరికితే పెళ్లి చేసుకుంటా అని చెప్పింది. ప్రస్తుతం వస్తున్న సమాచారం ప్రకారం సదా తన చిన్ననాటి స్నేహితుడిని త్వరలోనే పెళ్లి చేసుకోనుందట.

గతకొంత కాలంగా వారిద్దరూ డేటింగ్ లో ఉన్నారట. కానీ పెళ్లి విషయం ఇంకా కన్ఫర్మ్ కాలేదు. అతని పెళ్లి కన్ఫర్మ్ అవ్వగానే సదా అఫీషియల్‌గా ఈ గుడ్ న్యూస్ అనౌన్స్ చేసే అవకాశం ఉంది. మరి ఈ వార్తల్లో నిజమైందో తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా సదా ఫ్రెండ్ చాలా రిచ్ అని కూడా వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే సదా హాయిగా లైఫ్ లో సెటిల్ అయిపోతుంది.