వామ్మో: శర్వానంద్‌కు కాబోయే భార్య‌కు షాకింగ్ బ్యాక్‌గ్రౌండ్‌…!

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ హిట్ ప్లాప్‌లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ టాలీవుడ్ లో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో వరుస‌ షూటింగ్లో ఫుల్ బిజీగా ఉన్న ఈ యువ హీరో ఓ క్రేజీ న్యూస్ తో సోషల్ మీడియాలో వైరల్ గా మారాడు. ఎప్పటి నుంచో శర్వానంద్ పెళ్లి గురించి ఎంతో చర్చ జరుగుతుంది. ప్ర‌స్తుతం శ‌ర్వానంద్ వ‌య‌స్సు 38 ఏళ్లు. ఈ ముదురు బ్యాచిల‌ర్ పెళ్లి కోసం అంద‌రూ ఏళ్లుగా వెయిటింగ్‌లో ఉన్నారు.

Sharwanand injured on the sets of 96 remake- Cinema express

తాజాగా మరోసారి శర్వా పెళ్లి టాపిక్ హాట్ టాపిక్ గా మారింది. త్వరలోనే శర్వానంద్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. అయితే శర్వానంద్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరు ? అని అందరూ ఎంతో ఆసక్తిగా ఆరా తీస్తున్నారు. అయితే శర్వానంద్ తెలంగాణ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు అని తెలుస్తుంది.
ఆమె బ్యాక్ గ్రౌండ్ కూడా చాలా పెద్దదట. శర్వానంద్ పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి ఓ ప్రముఖ రాజకీయ నాయకుడు మనవరాలు అని తెలుస్తుంది.

sharwanand marriage, శ‌ర్వానంద్ పెళ్లి.. పెళ్లి కూతురు ఎవ‌రంటే.. చ‌ర‌ణ్ రూట్‌లోనే? - hero sharwanand getting married soon deatials here - Samayam Telugu

ఆమె రెడ్డి సామాజిక వ‌ర్గం అమ్మాయి ప్రస్తుతం ఆమె అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసిందంట త్వరలోనే ఆమె మెడలో శర్వానంద్ మూడుముళ్ళు వేయనున్నాడు. అలాగే శర్వానంద్ ఎంగేజ్మెంట్ ఈ నెల 26న గ్రాండ్ గా జరగనుంది. అలాగే వచ్చే నెలలో పెళ్లి అని తెలుస్తోంది. ఈ పెళ్లి వార్తలపై ఇప్పటివరకు శర్వానంద్ స్పందించడం లేదు.