తారకరత్న పై విష ప్రయోగం జరిగిందా..!!

మాజీ సీఎం సీఎం చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ యువమంగళం పేరిట పాదయాత్రను ఈ రోజున ప్రారంభించారు. చిత్తూరు జిల్లా కుప్పంలోనే లక్ష్మీపురం లో ఉన్న శ్రీ వరదరాజ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఉదయం 11:03 గంటలకు ఆయన పాదయాత్ర ప్రారంభించారు.. 400 రోజులపాటు నాలుగు వేల కిలోమీటర్ల సుదీర్ఘంగా పాదయాత్ర కొనసాగబోతోందని తెలుస్తోంది. కుప్పంలో ప్రారంభమైన ఈ యాత్ర శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ముగియానుంది.

Actor Taraka Ratna faints during Lokesh's padyatra | The News Minute

లోకేష్ యువ మంగళం పాదయాత్రలో అపశృతి చోటు చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. యాత్రలో పాల్గొన్న తారతరత్న అస్వస్థకు గురయ్యారని తెలుస్తోంది. దీంతో వెంటనే అక్కడే ఉన్న ఆసుపత్రికి తరలించగా కేసి ఆసుపత్రి లో చికిత్స అందించిన అనంతరం ఈఎస్ ఆసుపత్రికి తరలించారు.. వైద్యులు పరిస్థితి సమించిన తరువాత బెంగళూరుకి తరలించారని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది. అయితే తారకరత్న ఆసుపత్రికి వచ్చినప్పుడు పల్స్ లేదని వైద్యులు తెలియజేయడం జరుగుతోంది. శరీరం నీలంగా మారిందని వెంటనే చికిత్స ప్రారంభించాలని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది. సాధారణంగా తారకరత్న పల్స్ స్థితి చేరుకోవడానికి 45 నిమిషాల సమయం పట్టిందని వైద్యులు తెలిపారు.

Taraka Ratna Brought To Hospital Without Pulseఅయితే మరొకవైపు తారకరత్న పై విష ప్రయోగం జరిగిందనే అనుమానాన్ని కూడా తెలియజేస్తున్నారు టిడిపి నేతలు. అయితే ఈ విషయం తెలిసిన తరువాత బయట ఇచ్చే ప్రసాదాలు ఆహారంపై చాలా జాగ్రత్తగా ఉండాలని తారకరత్న అభిమానులు సూచిస్తున్నారు. కేవలం తారకరత్న శరీరం నీలం రంగులోకి మారడం వల్లే ఇలా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని తెలియజేస్తున్నారు. ప్రస్తుతం తారకరత్న ఆరోగ్యం నిలకడగానే ఉందంటూ తెలుపుతున్నారు. ఇక సినిమాలకు గుడ్ బాయ్ చెప్పిన తారకరత్న ఎన్నో సంవత్సరాల తర్వాత నైన్ అవర్స్ అనే వెబ్ సిరీస్ లో నటించారు.