Pspk..అదరగొడుతున్న బాలయ్య అన్ స్టాపబుల్.. ప్రోమో..!!

నందమూరి బాలకృష్ణ హోస్టుగా సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న షోలలో అన్ స్టాపబుల్ షో ప్రస్తుతం రెండవ సీజన్ అందరిని ఆకట్టుకుంటోంది. ఇక పవన్ కళ్యాణ్ అభిమానులు బాలకృష్ణ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న అభిమానులకు తాజాగా ఒక ప్రోమో అని విడుదల చేయడం జరిగింది ఆహా టీమ్. ఫుల్ ఎపిసోడ్ని సంక్రాంతికి విడుదల చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ సంక్రాంతికి వీరసింహారెడ్డి టీం ఇంటర్వ్యూ రిలీజ్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది.

Pawan Kalyan Unstoppable.. నీ నవ్వు వరం సామీ.! - Mudra369
బాలయ్య విత్ పవన్ కళ్యాణ్ ప్రోమోతోనే సూపర్ అనిపించేలా ఉన్నారు .ప్రోమోలో కేవలం బాలక్రిష్ణ ఒక్క డైలాగ్ మాత్రమే విడుదల చేశారు. అది కూడా ఈయన మెజర్మెంట్ తీసుకోవాలని చెప్పిన డైలాగ్ వైరల్ గా మారుతోంది. పవన్ కళ్యాణ్ కూడా ఈ షోని ఫుల్ గా ఎంజాయ్ చేసినట్టుగా అతని నవ్వును చూస్తే మనకు అర్థమవుతోంది. ఇంతకీ పవన్, బాలయ్య ఈ స్పెషల్ చిట్ చాట్ ఎలా సాగింది పవన్ ని ఎలాంటి ప్రశ్నలు బాలయ్య అడగబోతున్నారు అసలు వీరిద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఎలాంటిది ఇలా అన్నిటికీ కూడా సమాధానం త్వరలో దొరుకుతుంది.

అన్ స్టాపబుల్ షో లో ఇప్పటివరకు చాలామంది గెస్ట్ రాగా పవన్ ఎంట్రీ మాత్రం నెస్ట్ లెవెల్ లో ఉంటుందని చెప్పవచ్చు. మొన్న వచ్చిన ప్రభాస్ ఎపిసోడ్ కి ఆహా సర్వర్ ఒకసారిగా హ్యాంగ్ అవ్వగా ఇక పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ వస్తే సర్వర్ ఒకటి రెండు గంటలు కాదు పూర్తిగా హ్యాంగ్ అయ్యే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అందుకు సంబంధించి ఒక ప్రోమో మాత్రం వైరల్ గా మారుతోంది.