అదిరిపోయే డ్యాన్స్‌తో ఆశ్చర్యపరచిన ఘట్టమనేని ఆడపడుచులు.. వీడియో వైరల్..

సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార ఇప్పటివరకు ఏ సినిమాలోనూ నటించలేదు కానీ తెలుగు రాష్ట్రాల్లో ఆమె బాగా పాపులర్ అయ్యింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ స్టార్ కిడ్‌కి పది లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. కాగా ఈ చిన్నారి తన ముద్దు ముద్దు మాటలతో, డ్యాన్సులతో, యాక్టింగ్‌తో మహేష్ అభిమానులకు మెప్పిస్తూనే ఉంటుంది. సోషల్ మీడియా ద్వారా అభిమానులు ఈమెతో ఎప్పుడూ టచ్ లో ఉంటుంటారు. సితార డాన్స్ మాత్రమే కాదు మంచిగా పెయింటింగ్స్ వేస్తుంది. సింగింగ్ టాలెంట్ కూడా తనకు ఉంది.

 

ఇక మహేష్ బాబు అక్క మంజుల కూడా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. అలానే మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు కుమార్తె భారతి కూడా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా గట్టమనేని అభిమానులకు సుపరిచితమైనది. కృష్ణ చనిపోయిన సమయంలో భారతి న్యూస్ మీడియా కెమెరా కి చిక్కింది. అప్పట్లో ఆమె ఫోటోలు వైరల్ కూడా అయ్యాయి. తర్వాత నుంచి ఈమె సితారతో కలిసి పలు డ్యాన్స్ వీడియోలు చేస్తూ వాటిని సోషల్ మీడియాలో వదులుతోంది. ఇందులో భాగంగా తాజాగా ఈ అక్క చెల్లెలు ఓ పాటకు అదిరిపోయే డ్యాన్స్ చేసి దానిని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో చూసిన ఘట్టమనేని అభిమానులు ఫిదా అయిపోయారు. ఈ వీడియో పై రియాక్ట్ అవుతూ సో క్యూట్ అంటూ తెగ పొగిడేస్తున్నారు.

 

భారతి చిన్నపిల్లేం కాదు. ఆమె టీనేజ్ వయసులో ఉన్నట్లు తెలుస్తోంది. డ్యాన్స్ కూడా బాగా చేస్తోంది. అలానే ఎక్స్‌ప్రెషన్స్ కూడా చక్కగా ఇస్తోంది. ఒకవేళ ఆమెకు సినిమాల్లో ఆసక్తి ఉంటే త్వరలోనే ముఖానికి మేకప్ చూసుకొని మన ముందుకు వచ్చే అవకాశం లేకపోలేదు.