తారక్ ఇంగ్లీష్ యాసపై బీభత్సమైన ట్రోలింగ్.. ఆ నటి ఎలాంటి కౌంటర్ ఇచ్చిందంటే..??

రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా అంచనాలకు మించి రికార్డులను బద్దలు కొట్టింది. ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకొని అక్కడ కూడా రికార్డులను సొంతం చేసుకుంది. బాహుబలి తర్వాత మళ్లీ తెలుగు ఇండస్ట్రీని ప్రపంచవ్యాప్తంగా తలెత్తుకునేలా చేసిన సినిమాగా ఆర్ఆర్ఆర్ పేరు తెచ్చుకుంది. ఇప్పటికే ఈ సినిమాను ఎన్నో అవార్డులు వరించాయి. కాగా ఇటీవల నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు కూడా లభించింది.

ఈ గోల్డెన్ గ్లోబ్ అవార్డు వేడుకలలో RRR మూవీ యూనిట్ సభ్యులందరూ హాజరయ్యారు. ఈ సందర్భంగా రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఇంటర్నేషనల్ వెరైటీ మ్యాగజైన్‌కి పలు ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఒక ఇంటర్వ్యూలో తారక్ అమెరికన్ యాస్ లో ఇంగ్లీష్ మాట్లాడుతూ అదరగొట్టాడు. ఎప్పుడూ తారక్ తనదైన వాయిస్ లో మాటలు మాట్లాడేవాడు. కానీ ఈసారి అతడు అమెరికన్ యాస ట్రై చేయడంతో చాలామంది ఆశ్చర్యపోయారు. నిజానికి అభిమానులు తారకు అమెరికన్ యాసకు ఫిదా అయిపోయారు. కానీ ట్రోలర్స్ మాత్రం అతడి యాక్సెంట్‌ను ఎగతాళి చేస్తూ బీభత్సంగా ట్రోల్ చేశారు.

 

ఈ క్రమంలో చాలామంది ఎన్టీఆర్‌కి సపోర్ట్ గా నిలుస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ నటి కస్తూరి శంకర్ స్పందించింది. ఎన్టీఆర్‌ను ట్రోల్ చేస్తున్న వారందరికీ తనదైన శైలిలో దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది. “ఎన్టీఆర్ అమెరికన్ భాషలో చాలా బాగా మాట్లాడాడు. అతను ఆ భాషలో మాట్లాడుతూ చాలా ఎంజాయ్ చేసినట్లు అనిపించింది. నిజానికి తారక్‌కి లోకల్ భాషలను లోకల్ యాస్‌లో మాట్లాడుతూ ఆ మాతృభాష వారికి కనెక్ట్ కావడం అంటే బాగా ఇష్టం అనుకుంటా. అందులో తారక్ నిజంగా అమేజింగ్. ఏ భాషలోనైనా అద్భుతంగా మాట్లాడగల వరాన్ని దేవుడు అతనికి ఇచ్చాడు.” అని ఆమె ట్వీట్ చేసింది. కాగా ఈ ట్వీట్‌ను చాలా మంది లైక్ చేస్తున్నారు.