మైత్రి మూవీ మేకర్స్‌ బ్యానర్‌లో రెండు భారీ సినిమాలు రిలీజ్.. రిజల్ట్ ఏంటంటే..

ప్రముఖ టాలీవుడ్ ప్రొడక్షన్ హౌజ్ మైత్రి మూవీ మేకర్స్ ప్రేక్షకులకు ఎన్నో పెద్ద, మంచి సినిమాలను అందిస్తోంది. శ్రీమంతుడు, చిత్రలహరి, డియర్ కామ్రేడ్, రంగస్థలం, పుష్ప సర్కార్ వారి పాట ఇలా చాలా సినిమాల నిర్మాణంలో మైత్రి మూవీ మేకర్స్ పాలుపంచుకుంది. ఈ సంక్రాంతికి విడుదలైన రెండు భారీ సినిమాలను కూడా ఇదే ప్రొడక్షన్ హౌస్ నిర్మించింది. ఆ రెండు సినిమాలు మరేవో కావు నందమూరి బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి, చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య. వచ్చేనెల అంటే ఫిబ్రవరి 10న రిలీజ్ అవుతున్న కళ్యాన్ రామ్ అమిగోస్‌ సినిమాని కూడా ఈ నిర్మాణ సంస్థ ప్రొడ్యూస్ చేస్తుంది. అలానే పుష్ప 2, ఎన్టీఆర్ 31వ సినిమా, ఖుషి, ఆర్‌సీ 16 సినిమాలను కూడా మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్‌ చేస్తుంది.

అయితే ఈ ఏడాది రిలీజ్ మైత్రి మూవీ మేకర్స్‌ బ్యానర్‌లో రెండు భారీ సినిమాలు రిజల్ట్ నిర్మాణ సంస్థకు లాభాన్ని చేకూర్చిందా లేక నష్టాన్ని నిలిచిందా అనేది ఇప్పుడు చూద్దాం. వీర సింహా రెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలు కూడా ఒక్క రోజు తేడాతో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇవి రెండూ బ్లాక్‌బస్టర్ హిట్ టాక్ తెచ్చుకున్నట్లయితే మైత్రి మూవీ మేకర్స్ అసలైన పండుగ చేసుకునేది. ఎందుకంటే ఇవి రెండు భారీ సినిమాలే. మంచి టాక్ ఉంటే ఈ రెండు సినిమాలు వందల కోట్లలో లాభాలు తెచ్చిపెట్టేది కానీ రెండు సినిమాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి.

వినోదాన్ని పంచే కంటే హింసను చూపించేలా ఉన్న ఈ సినిమాలు ఈ సంక్రాంతికి వచ్చి నిరాశపరిచాయని టాక్‌ ఎక్కడ చూసినా వినిపిస్తోంది. బాక్సాఫీస్ కలెక్షన్లు చూస్తుంటే ఇవి రెండూ కూడా తమ బడ్జెట్లో సగం కూడా ఇంకా రాబట్టలేకపోయాయి. ఏది ఏమైనా రెండు మూడు వారాల తర్వాత ఇవి రాబట్టిన కలెక్షన్లను బట్టి మైత్రి మూవీ మేకర్స్‌కి లాభాలు వచ్చాయా నష్టాలు వచ్చాయా అని తెలుస్తుంది.