అభిమానులకు గుడ్ న్యూస్..తల్లి కాబోతున్న ప్రభాస్ హీరోయిన్..!!

టాలీవుడ్ చలన చిత్ర పరిశ్రమలో ప్రభాస్ కి ఉన్న క్రేజ్ , రేంజ్ , ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో స్టేటస్ సంపాదించుకున్న ప్రభాస్ ..ప్రజెంట్ నటిస్తున్న సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి . మారుతి డైరెక్షన్ లో రిలీజ్ కాబోతున్న రాజా డీలక్స్ సినిమా తప్పిస్తే ..ప్రెసెంట్ ఆయన చేతిలో ఉన్న అన్ని సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లోనే రిలీజ్ కు సిద్ధంగా ఉండడం గమనార్హం .

 

కాగా ఇలాంటి క్రమంలోనే అందరూ ఆయన క్రేజ్ ను వాడుకోవాలని చూస్తున్నారు. ఇదే క్రమంలో ప్రభాస్ తో సాహో సినిమాలో నటించిన బ్యూటీ తల్లి కాబోతుండడంతో సోషల్ మీడియాలో ప్రభాస్ హీరోయిన్ తల్లి కాబోతుంది అంటూ ఆయన పేరుని వాడుకుంటూ ఆ హీరోయిన్ ప్రెగ్నెన్సీ ఫొటోస్ ను వైరల్ చేస్తున్నారు. సాహో సినిమాలో ప్రభాస్ తో నటించిన మెప్పించిన ఎలివెన్ శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . పలు హిందీ చిత్రాలతో బాలీవుడ్లో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె పెళ్ళికి ముందు బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటించి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది .

కాగా 2019 అక్టోబర్ లో ఎలెవన్ శర్మకు ఇండో-ఆస్ట్రేలియా డెంటల్ సర్జన్ వ్యాపారవేత్త అయిన తుషాన్ బిండితో ఎంగేజ్మెంట్ జరిగింది. ఆ తర్వాత మే 5న 2021న ఆస్ట్రేలియాలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. అదే ఏడాది మొదటి పాపకు జన్మనిచ్చిన ఈ జంట త్వరలోనే రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. ఇదే విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు . “సెకండ్ బేబీ వస్తుంది తనని ..నా భుజాలపై ఎత్తుకోవడానికి ఈగర్ గా వెయిట్ చేస్తున్న” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. దీంతో ప్రభాస్ హీరోయిన్ పేరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .  ఇక 2019లో డార్లింగ్ ప్రభాస్ తో యంగ్ అండ్ క్రియేటివ్ డైరెక్టర్ సుజీత్ తెరకెక్కించిన ‘సాహో’లోనూ ముఖ్య పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులను అలరిచింది. కాగా పెళ్లి ప్రెగ్నెన్సీ కారణంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ బ్యూటీ.. సోషల్ మీడియాలో మాత్రం అభిమానులకు ఎప్పుడు టచ్ లోనే ఉంది..!!

 

 

View this post on Instagram

 

A post shared by Evelyn Sharma (@evelyn_sharma)