రామ్ చరణ్- శంకర్ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్… సినిమా మామూలుగా లేదుగా..!

త్రిబుల్ ఆర్ సినిమా వంటి పాన్ ఇండియా హిట్ తర్వాత‌ రామ్ చరణ్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా ఆర్సి15. ఈ సినిమాను సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తుండగా టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా ఎంతో శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ ముగించుకుని దసరా కానుకగా ప్రేక్షకులు ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.

అయితే ఈ క్రేజీ కాంబినేషన్ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ఈ సినిమా స్టోరీ ఏ కోణంలో ఉంటుంది అంటూ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమాలో ఎలాగో కమర్షియల్ అంశాలు ఉంటాయి.. కాకపోతే శంకర్ సినిమాలో ఒక మంచి మెసేజ్ కూడా ఉంటుంది. ఇక ఆ మెసేజ్ ప్రస్తుత రాజకీయాలకు సంబంధించి అని టాక్ కూడా నడుస్తుంది.

ఇప్పుడు సమాజంలో జరుగుతున్న మన ఓటు అమ్ముకుంటే మన పిల్లల బంగారు జీవితాలు పోగొట్టుకున్నట్లే అని చెప్పే మెసేజ్ ను ఈ సినిమాలో ఎంతో హైలైట్ గా చూపించబోతున్నారట. ఈ సినిమా సెకండ్ హాఫ్ లో వచ్చే ఓ స్పెషల్ ఎపిసోడ్‌లో సీనియర్ హీరోయిన్ కుష్బూ కూడా నటించబోతుంది. ఆ క్యారెక్టర్ ద్వారానే ఈ మెసేజ్ ను చూపించబోతున్నారట. ప్రధానంగా రామ్ చరణ్ ఓల్డ్ పాత్ర కూడా చాలా పవర్ఫుల్ గా ఉంటుందని కూడా తెలుస్తుంది.

Shankar Ram Charan : పొలిటిషియన్ లుక్‌లో సైకిల్‌పై రామ్ చరణ్.. ఫొటో లీక్..!  | Tufan9 Telugu News : Latest Telugu News | తెలుగు వార్తలు - Tufan9.com

ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ తన కెరియర్ లోనే బెస్ట్ పర్ఫామెన్స్ బెస్ట్ లుక్స్ తో కనిపించబోతున్నాడు. వెరీ స్టైలిష్ లుక్ లో విభిన్న శైలితో చరణ్, ఈ సినిమాలోనే ఎంతో హైలైట్‌ గా నిలుస్తాడట. పైగా ఈ సినిమాలో చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. వీటిలో ఒక పాత్రలో గ్రామీణ యువకుడిగా, మరో పాత్రలో ఎంతో స్టైలిష్ గా కనిపిస్తాడట. చరణ్ లుక్ కోసం బాలీవుడ్ ప్రముఖ హెయిర్‌ స్టైలిస్ట్ అలీమ్ హకీమ్ పనిచేస్తున్నాడు. మొత్తానికి భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ భారీ సినిమాలో ఎంతో బరువైన ఎమోషన్స్ తో పాటు భారీ విజువల్స్ కూడా ఉండబోతున్నాయి.