it’s Official: మెగా ఇంట పెళ్ళి భాజా..మూడో పెళ్లి చేసుకోబోతున్న శ్రీజ..!!

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవికి ఎలాంటి పేరు ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు . ఎటువంటి హెల్ప్ సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి హీరోగా ఎదగడమే కాకుండా స్టార్ హీరోగా మారి మెగాస్టార్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మెగాస్టార్ చిరంజీవి అంటే అందరికీ అదోరకమైన తెలియని గౌరవం . అయితే అతను ఎంత కష్టపడి ఆ పేరును సంపాదించుకున్నాడో,, అంతలా తన చిన్న కూతురు శ్రీజ ఆ పేరుని పాతాళానికి పడిపోయేలా చేస్తుంది అంటూ మెగా ఫాన్స్ మండి పడుతున్నారు . దానికి రీజన్స్ మనకు తెలిసినవే..

మొదట ఇంట్లో చెప్పకుండా ప్రేమించి పెళ్లి చేసుకున్న శ్రీజ ..ఆ తరువాత అతగాడితో ఓ బిడ్డను కన్నేసి.. అతగాడికి దూరమైంది..ఆ తర్వాత ఇంట్లో వాళ్ళు చెప్పిన సంబంధాన్ని చూసి పెళ్లి చేసుకున్న శ్రీజ..రెండో భర్త కళ్యాణ్ దేవ్ తో కొన్నాళ్లు బాగానే కాపురం చేసింది. దాని రిజల్ట్ నే ఓ పాపకు జన్మనిచ్చింది. అయితే కొన్ని మనస్పర్ధలు కారణంగా అతగాడికి విడాకులు ఇచేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. కాగా కొద్ది రోజుల నుంచి శ్రీజ మూడో పెళ్లి చేసుకోబోతుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపించినా.. ఇప్పటివరకు దానిపై అఫీషియల్ ప్రకటన అయితే రాలేదు. దీంతో అదంతా ఫేక్ అంటూ మెగా ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.

కానీ రీసెంట్ గా శ్రీజ చేసిన పోస్ట్ మెగా ఫాన్స్ లో కొత్త అలజడి మొదలైంది . న్యూ ఇయర్ సందర్భంగా ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేస్తూ ..తన మూడో పెళ్లి చేసుకుంన్నట్లు చెప్పకనే చెప్పేసింది. ఆమె తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ..”డియర్ 2022 , నా జీవితంలో ఎంతో ఇష్టమైన మంచి వ్యక్తిని కలిసేలా చేసావ్ ..థాంక్యూ థాంక్యూ సో మచ్ ..నా గురించి బాగా తెలిసిన.. నన్ను అర్థం చేసుకుని.. నన్ను అమితంగా ప్రేమించే కేరింగ్ పర్సన్ ని నాకు పరిచయం చేసేలా చేసినందుకు చాలా థాంక్స్ . కష్టసుఖాల్లో నాకు తోడు ఉండే వ్యక్తి ఎప్పుడూ నాకు సపోర్టుగా నిలబడే వ్యక్తి.. నన్ను కలవడం నాకు ఎంతో ఆనందంగా ఉంది . నా ఈ కొత్త ప్రయాణం మొదలవుతుంది అంటూ ఇంట్రెస్టింగ్ పోస్ట్ ని షేర్ చేసింది . దీంతో శ్రీజ మూడో పెళ్లికి రెడీ అయిందని ఆ విషయాన్ని ఇలా పోస్ట్ ద్వారా చెప్పేస్తుందంటూ నెటిజన్స్ ఆమెకు కంగ్రాట్స్ చెప్తున్నారు.