ప‌వ‌న్‌కు బిగ్ టార్గెట్ ఇచ్చిన ప్ర‌భాస్‌… ప‌వ‌ర్‌స్టార్ స‌త్తా చాటుతాడా..!

మామూలు టక్ షో గా మొదలైన బాలయ్య ఆన్ స్టాపబుల్ షో ఇప్పుడు ఇండియాలోనే నెంబర్ వన్ టాక్ షో గా మారింది. ఇక ఇప్పటికే మొదటి సీజన్ కంప్లీట్ చేసుకుని రెండో సీజన్లో కూడా ఎవరు ఊహించని రీతిలో అదరగొడుతున్నాడు. ఇప్పటికే ఆరు ఎపిసోడ్‌లు కంప్లీట్ చేసుకుని.. న్యూ ఇయర్ కానుకగా బాహుబలి ఎపిసోడ్‌గా వచ్చిన ప్రభాస్ ఎపిసోడ్ ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకుంది.

Prabhas With NBK | Prabhas Unstoppable 2 Episode | Balayya - YouTube

ముందుగా ఈ ఎపిసోడ్ ఆహలో స్టీరింగ్ అవగానే ప్రభాస్ అభిమానుల తాకిడికి తట్టుకోలేక ఈ యాప్ సర్వర్ లన్ని క్రాష్ అయ్యాయి. మళ్లీ వాటిని లైన్ చేయడానికి వారికి చాలా సమయం పట్టింది. ప్రభాస్ ఎపిసోడ్ కు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే వ్యూస్ తో పాటు.. భారీ రికార్డ్స్ ను క్రియేట్ చేసింది. ఈ ఎపిసోడ్ కి దాదాపు కోటి పైగా వ్యూస్ రాగా.. అది కేవలం వారం రోజులలోనే కావడంతో ఇంత భారీ వ్యూస్ దక్కించుకున్న ఏకైక ఎపిసోడ్‌గా ఇది సరికొత్త రికార్డులను సృష్టించింది.

THE FOLLOWING ARE FIVE QUESTIONS THAT BALAYYA MIGHT ASK PAWAN KALYAN -  Filmybowl Best Telugu Files News, Telugu Fil Updates, Film News Updates,  Tollywood News Updates

ఇక ఆహాలో ఇప్పుడు మరో బ్లాక్ బస్టర్ ఎపిసోడ్ కూడా రాబోతుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెస్ట్ గా రాబోతున్నాడు. ఇప్పటికే ఈ ఎపిసోడ్ కు సంబంధించిన షూటింగ్ కూడా మొదలుకాగా. సంక్రాంతి కానుకగా ఈ ఎపిసోడ్ ఆహా లో స్ట్రీమింగ్ కానుంది. ఈ ఎపిసోడ్ కి ఎలాంటి రికార్డ్స్ వస్తాయో చూడాలి.

Unstoppable With NBK Pawan Kalyan

అయితే ప్రభాస్ ఎపిసోడ్ ను మించి కోటి వ్యూస్ రికార్డును బద్దలు కొడుతుందా లేదా అనేది చూడాలి. ఇక ఇప్పటివరకు ఈ ఎపిసోడ్ కి సంబంధించి ఎలాంటి ప్రోమో కూడా విడుదల కాలేదు. ఇక త్వరలోనే ఈఎపిసోడ్‌కు సంబంధించిన వివరాలు కూడా తెలియచెయ్యబోతుంది ఆహా మీడియా టీమ్‌.