చిరంజీవి- కృష్ణ అగ్నిజ్వాల ఆగిపోవడానికి కారణం అదేనా..తెర వెనక ఇంత జరిగిందా..?

టాలీవుడ్ లో కొన్ని కాంబినేషన్ల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. తెలుగు చిత్ర పరిశ్రమంలో ఎవరి సపోర్ట్ లేకుండా ఎదిగిన హీరోల్లో సూపర్ స్టార్ కృష్ణ ఎప్పుడు ముందు వరుసలో ఉంటాడు. ఆయన తర్వాత తరం వచ్చిన వారిలో స్వయంకృషి తో ఎదిగిన మెగాస్టార్ చిరంజీవి కూడా తెలుగు చిత్ర పరిశ్రమంలో ఆగ్ర హీరోగా కొనసాగుతున్నాడు. ఇలా స్వయంకృషితో ఎదిగిన ఈ ఇద్దరు హీరోలు నటించిన ఏకైక సినిమా తోడుదొంగలు. ఆ తర్వాత మరో సినిమా తీయడానికి ప్రయత్నాలు జరిగిన అది మధ్యలోనే ఆగిపోయింది.

మాటలకు అందని విషాదం ఇది: చిరంజీవి

ఇక ఇప్పుడు వాటి వివరాల్లోకి వెళితే కృష్ణ తో సినిమా తీయాలని సీనియర్ డిస్ట్రిబ్యూటర్ కం నిర్మాత అయిన నవభారత్ బాబురావు ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఆయన అంతకుముందు ఆడదంటే అలుసా అనే సినిమాను నిర్మించాడు. ఇక తన రెండవ సినిమాగా పెళ్లిళ్ల పేరయ్య నిర్మించాడు. తన మూడో సినిమాగా కృష్ణతో సినిమా తీయాలని భావించాడు. అంతేకాకుండా అప్పటివరకు కృష్ణ నటించిన సినిమాలు కంటే ఈ సినిమా ఎంతో భారీగా ఉండాలని బాబురావు భావించాడు.

Chiranjeevi mourns the death of Superstar Krishna- Cinema express

కృష్ణ కూడా ఈ సినిమాకు ఒకే చెప్పాడు అదే సమయంలో మలయాళం లో సూపర్ హిట్ అయిన ఓ మలయాళీ సినిమా రీమేక్ హక్కులను కొనుగోలు చేశారు బాబురావు. ఆ సినిమా కథను తెలుగు నేటివిటీకి తగ్గట్టు దిగ్గజ రచయిత ఆచార్య ఆత్రేయతో మార్పులు చేయించాడు. ఈ సినిమాలో అన్నదమ్ముల పాత్రల కోసం కృష్ణ- చిరంజీవిని ఎంపిక చేసుకున్నారు. ఇందులో అక్క పాత్రకు జయంతిని తీసుకోవాలని నిర్ణయించుకున్నారు.

Super star krishna,Megastar Chiranjeevi movie Agni Jwala

ఈ సినిమాను కె ఎస్ ఆర్ దాస్ ని డైరెక్టర్ గా అనుకున్నారు. ఇక అగ్ని జ్వాల అనే పేరుని కూడా కన్ఫర్మ్ చేశారు. ఈ సినిమాకు కృష్ణ కూడా తన డేట్స్‌ను సద్దుబాటు చేసుకుని ఇచ్చాడు. చిరంజీవి డేట్స్ కోసం నిర్మాత వెళ్లారు కృష్ణతో సినిమా అనగానే చిరు కూడా ఎంతో ఉత్సాహంతో ఓకే చెప్పేసాడు. అయితే ఈ క్రమంలోనే డేట్స్ కుదరకపోవడంతో కృష్ణకు తమ్ముడుగా మరో హీరోని ప్రయత్నం చేయమని కృష్ణ సూచించాడు. అదే సమయంలో విష్ణు వర్ధన్, పద్మప్రియ జంటగా నటించిన అసాధ్య ఆలీయా సినిమా విడుదలై సక్సెస్ అందుకుంది.

Incredible Achievements of Superstar Krishna in over 5 decades journey - Cine Chit Chat

దీన్ని చూసిన కృష్ణ ఈ సినిమా రీమేక్ చేస్తే బాగుంటుందని చెప్పడంతో రీమేక్ హక్కులు కొన్నారు. దీంతో అగ్నిజ్వాల మూవీ స్క్రిప్ట్ పక్కన పెట్టేసి, అసాధ్య అలియా మూవీని మాయదారి అల్లుడు పేరిట రీమేక్ చేసారు. కృష్ణ,జయప్రద జంటగా వచ్చిన ఈ మూవీ కె ఎస్ ఆర్ దాస్ డైరెక్షన్ లో తెరకెక్కింది. సినిమా బాగానే ఆడింది. అయితే అగ్నిజ్వాల మూవీ స్క్రిప్ట్ ని బాబురావు వదల్లేదు. మోహన్ బాబు,నరేష్ కాంబోలో తీశారు.