సౌత్ సినీ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తూ స్టార్ హీరోల సినిమాలు ధియేటర్ లోకి వచ్చాయి. ముందుగా కోలీవుడ్ స్టార్ హీరోలు అజిత్, విజయ్ వారసుడు- తెగింపు సినిమాలతో వారి అభిమానులకు సంబరాలు తీసుకొచ్చారు. ఈ రెండు సినిమాలు కూడా మొదటి రోజు బెస్ట్ కలెక్షన్స్‌ను రాబట్టాయి. కానీ తెలుగు సూపర్ స్టార్ బాలకృష్ణ మాత్రం బాక్సాఫీస్ వద్ద విజయ్- అజిత్‌లను వెనక్కి నెట్టేసాడు.
సంక్రాంతి కానుకగా ఈనెల 12న థియేటర్లోకి వచ్చిన బాలయ్య వీర సింహారెడ్డి సినిమా మొదటి రోజే రూ.50 కోట్ల క్లబ్‌లో చేరింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.54 కోట్ల కలెక్షన్లను వసూల్ చేసింది. ఈ సినిమా కలెక్షన్ల సమాచారాన్ని ఈ చిత్ర నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ విడుదల చేశారు. ఈ సంవత్సరం బిగ్గెస్ట్ ఓపెనింగ్ సాధించిన తొలి సినిమాగా బాలయ్య వీర సింహారెడ్డి రికార్డ్ సృష్టించింది.
ఆల్ ఇండియా కలెక్షన్స్ 42 కోట్లు. ఆంధ్రప్రదేశ్-తెలంగాణ నుండి 38.7 కోట్లు మరియు కర్ణాటక నుండి 3.25 కోట్లు. ఓవర్సీస్‌లో కూడా 8 కోట్లు రాబట్టింది. ఈ సినిమా బాలయ్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ సక్సెస్‌గా నిలిచింది. అజిత్ తెగింపు, విజయ్ వారసుడు కూడా ఈ పండక్కి ప్రేక్షకుల ముందుకు రాక ఈ రెండు సినిమాలు కూడా తొలి రోజు రూ.50 కోట్లు దాటాయని ట్రేడ్ వర్గాలు నివేదిక ప్రకారం తెలుస్తుంది.
వారసుడు తమిళ్ వెర్షన్ తొలిరోజు రూ.49 కోట్ల గ్రాస్ కలెక్షన్ రాగా. అజిత్ తెగింపు రూ.42 కోట్ల గ్లోబల్ కలెక్షన్స్ రాబట్టుకుంది. వారసుడు తెలుగు వెర్షన్ ఈరోజు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నిన్న చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొత్తంగా ఈ సంక్రాంతికి బాలయ్య దుమ్ము దులిపేసాడు.