రామ్ చరణ్ కు భారీ అవమానం.. ఉపాసన ముందు ఇడియట్ అంటూ తిట్టిన చిరు..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో సూపర్ హిట్ అందుకుని పాన్ ఇండియా హీరోల్లో ఒకడిగా కొనసాగుతున్నాడు. ఇక రీసెంట్ గానే గోల్డెన్ క్లోబ్ అవార్డ్స్ వేడుకల్లోమెరిసి తన అభిమానులకు మంచి ట్రీట్ ఇచ్చాడు. అక్కడ ప్రపంచవ్యాప్తంగా తన క్రేజ్ ను పెంచుకున్నాడు. ఇక ఈ క్రమంలోనే అక్కడ ఇంటర్నేషనల్ మీడియాతో ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రధానంగా తనకి తన తండ్రి చిరంజీవి మధ్య ఉన్న అనుబంధాన్ని కూడా వివరించాడు.

నాన్న 41 సంవత్సరాలుగా చిత్ర పరిశ్రమలో ఉన్నారు. ఆయనను చూసి నేను ఎన్నో నేర్చుకున్నాను.. ఒక నుటుడుగా కొన్ని విషయాల్లో ఆయన చాలా పర్టికులర్ గా ఉంటాడు. మరి ముఖ్యంగా బాడీ ఫిట్నెస్ విషయంలో అసలు తగ్గరు. ఒక్క రోజు నేను డైనింగ్ టేబుల్ వద్ద భోజనం చేస్తుంటే..ఏంటి చరణ్ కొంచెం తగ్గినట్లు ఉన్నావ్..అసలు భోజనం తినడం లేదా..? అని అడిగాడు.

నేను కూడా అది నిజమే అనుకున్నాను డాడీ అని తల ఊపాను.. అప్పుడు వెంటనే ఆయన ఇడియట్.. అసలు నువ్వు ఏం చేస్తున్నవు బరువు పెరిగావు కనిపించడం లేదా..? జిమ్ వర్క్ సరిగా చేస్తున్నావా లేదా..? రేపటి నుంచి ఇంకా కొంచెం సరిగా వర్క్ అవుట్ చెయ్ అని గట్టిగా అనేసాడు. ఇక అప్పుడు అక్కడే ఉన్న ఉపాసన ఆ మాటలు విని.. ఏంటి మిమ్మల్ని అలా అవమానిస్తున్నారని అడిగింది. అది నా అవమానం కాదు.. ఇద్దరు నటుల మధ్య డిస్కషన్ ఇలాగే ఉంటుందని ఉపాసనకు చెప్పానని అన్నాడు రామ్ చరణ్.

చిన్నతనం నుంచి నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం చదువుపై ఎక్కువ ఆసక్తి ఉండేది కాదని రామ్ చరణ్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. నేను చదువుకునే రోజుల్లో ఒకరోజు మా కాలేజ్ ప్రిన్సిపాల్ మా నాన్నకు ఫోన్ చేసి మీ అబ్బాయి ఏది అవ్వాలనుకుంటే అది అవ్వనివ్వండి.. అని అన్న‌రని రామ్ చరణ్ వెల్లడించడం గమనార్హం. కొడుకు టైమ్ ను , నా టైమ్ ను వృథా చేయొద్దని ఆయన చెప్పారని రామ్ చరణ్ కామెంట్లు చేశారు.ఆ తర్వాత నేను యాక్టింగ్ స్కూల్ కు షిప్ట్ అయ్యానని రామ్ చరణ్ చెప్పుకొచ్చారు.రామ్ చరణ్ వెల్లడించిన ఈ విషయాలు సోష‌ల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చరణ్ కు క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది.