నాని డైరెక్టర్ తో విజయ్ దేవరకొండ సినిమా…లైగ‌ర్ కు మించిన డిజాస్టర్ కానుందా..!

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన లైగ‌ర్ సినిమాతో గ‌త సంవ‌త్స‌రం ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో విజయ్‌కు జంటగా అనన్య పాండే హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా విడుదలైన మొదటి షో నుంచే ప్రేక్షకుల నుంచి భారీ నెగిటివ్ టాక్‌ను మూట కొట్టుకుని భారీ డిజాస్టర్ సినిమాగా మిగిలిపోయింది.

मनी लॉन्ड्रिंग केस में फंसे Vijay Devarakonda, Liger में लगा विदेशी पैसा!  ईडी ने भेजा समन - liger actor vijay devarakonda get summoned by ed in money  laundering case tmova - AajTak

ఈ సినిమా తర్వాత ప్రస్తుతం విజయ్ దేవరకొండ శివనిర్మాణ దర్శకత్వంలో ఖుషి సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో విజయకు జంటగా స్టార్ హీరోయిన్ సమంత నటిస్తుంది.ఈ సినిమాపై విజయ్- సమంత అభిమానులతో పాటు సాధారణ సినీ ప్రేక్షకులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. అయితే ఇప్పుడు మరో విశేషం ఏమిటంటే, ఈటీవీల న్యాచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన సూపర్ హిట్ మూవీ జెర్సీ.. ఈ సినిమాను యువ దర్శకుడుగౌతమ్ తిన్ననూరి తెరకెక్కించాడు.

ఆ డైరెక్టర్ తో విజయ్ దేవరకొండ నెక్స్ట్ ప్రాజెక్ట్.. అలా ఫిక్స్ అయ్యారు |  Vijay Deverakondas Next Film Is Fixed With This Director Gautam Tinnanuri  Details, Vijay Devarakonda, Kushi Movie ...

ఇక ఇప్పుడు విజయ్ దేవరకొండ తన నెక్స్ట్ మూవీ ఈ దర్శకుడు తో తాజాగా అనౌన్స్ చేశాడు.టాలీవుడ్ లో వరుస విజయాల్లో దూసుకుపోతున్న యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ, సితార బ్యానర్ పై ఈ సినిమాను ఎంతో గ్రాండ్గా నిర్మించబోతున్నామని సంక్రాంతి కానుకగా ఈ సినిమా అఫీషియల్ అనౌన్స్ మూవీ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్.

ఆ పోస్టర్ పై.. ‘నేను ఎవరికి ద్రోహం చేశానో చెప్పడానికి నేను ఎక్కడున్నానో నాకు తెలియదు’ అంటూ ఒక గూఢచారి చెప్పే మాటల్ని ఆ పోస్టర్‌లో చూపించారు. విజయ్ దేవరకొండ కెరియర్ లోనే 12వ సినిమాగా తెరకెక్కక పోతుంది. ప్రస్తుతం ఈ పోస్టర్ ఇప్పుడు అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటుంది. కాగా ఈ సినిమా గురించి పూర్తి వివరాలు అతి త్వరలోనే వెళ్లడంచనున్నారు.