బన్నీ కు క్రేజ్ తెచ్చి పెట్టిన సినిమా రీ రిలీజ్ డేట్ ఫిక్స్..!!

టాలీవుడ్ లో గత ఏడాది ఎక్కువగా రీ రిలీజ్ ట్రెండు బాగా కొనసాగింది. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమాలు సందడి బాగా చేశాయని చెప్పవచ్చు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ నటించిన సూపర్ హిట్ సినిమాలు జల్సా, ఖుషి సినిమాలు విడుదలయి బాగానే కలెక్షన్లు అందుకున్నాయి. ఇక మహేష్ బాబు నటించిన పోకిరి, ఒక్కడు, మురారి వంటి సినిమాలు కూడా రీ రిలీజ్ చేసి కలెక్షన్లు బాగానే సంపాదించాయి. అయితే ఇప్పుడు తాజాగా అల్లు అర్జున్ నటించిన దేశముదురు సినిమా విడుదల అయ్యి 16 ఏళ్లు పూర్తి కావస్తోందట. ఈ సందర్భంగా అల్లు అర్జున్ అభిమానులు ఈ సినిమాని రీ రిలీజ్ చేయాలని పట్టు బడడంతో విడుదల చేస్తున్నట్లు సమాచారం.

Desamuduru Full Movie Online Watch Desamuduru in Full HD Quality

అల్లు అర్జున్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన ఈ దేశ ముదురు సినిమా అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది. హీరోయిన్గా హన్సిక తెలుగు తెరకు పరిచయమయ్యింది. ఈ సినిమాని అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా రీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఏప్రిల్ 8వ తారీఖున అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 7వ తేదీన ఈ సినిమా గ్రాండ్గా రీ రిలీజ్ కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తెలుగు సినిమా హీరోలలో అల్లు అర్జున్ మొదటి సిక్స్ ప్యాక్ బాడీగా ట్రై చేసి స్టార్ హీరోగా అందుకున్న ఘనత అల్లు అర్జున్కి దక్కింది.

ఇప్పటికీ కూడా దేశముదురు సినిమా బుల్లితెర పైన వచ్చిందంటే చాలు మంచి టిఆర్పి రేటింగ్ సాధిస్తూ ఉంటుంది. మరి రీ రిలీజ్ అయితే అభిమానులు ఏ రేంజ్ లో సందడి ఉంటుందో చూడాలి మరి ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప-2 సినిమా షూటింగ్లో పాల్గొంటున్నారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.