ఎవరు ఊహించని విధంగా పుష్ప2.. సుక్కు ఇచ్చే ఈ ట్విస్ట్ చూస్తే మతి పోవాల్సిందే..!!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ కాంబోలో వచ్చిన భారీ పాన్ ఇండియా చిత్రం పుష్ప. ఈ సినిమా పాన్ ఇండియా లేవ‌ల్‌లో అదిరిపోయే కలెక్షన్లు కొల్లగొట్టి అల్లు అర్జున్ కు పాన్ ఇండియా స్థాయిలో ఇమేజ్‌ను తెచ్చిపెట్టింది. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా వచ్చే పుష్పది రూల్ కోసం భారతదేశం మొత్తం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తుంది. ఈ సినిమా షూటింగ్ కూడా రీసెంట్ గానే మొదలైంది.

Rashmika Mandanna gives an update on Pushpa 2 with Allu Arjun: 'I begin  in…' | Entertainment News,The Indian Express

ఇక ఇప్పుడు పుష్ప 2 అప్డేట్ కోసం బన్నీ అభిమానులు ఎంతో ఆత్రుతగాా ఎదురు చూస్తున్నారు. ఇక‌ ఇప్పుడు తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ గాసిప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పుష్ప 2 లో వచ్చే ఇంటర్వెల్ లో బన్నీ మాఫియా డాన్ లుక్ లో కనిపిస్తాడని.. అది కూడా హీరోయిన్గా నటించిన రష్మిక క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ లోనే వచ్చే ఈ ట్విస్టు ఎంతో థ్రిల్లింగ్ ఎలిమెంట్ గా ఉంటుందని..పైగా ఈ ట్విస్ట్ ఎవరు ఊహించిని రీతిలో అభిమానులను ఆకట్టుకునే విధంగా ఉంటుందని తెలుస్తుంది.

ఇక పుష్ప2 లో మొదటి భాగానికి మించి కొన్ని కీలక పాత్రలు కూడా ఈ సినిమాలో పరిచయం కానున్నాయి. ఈ పాత్రల కోసం ప్రముఖ అగ్ర నటులు ఆ పాత్రలలో కనిపించనున్నారు. అందుకే పుష్ప సీక్వెల్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక మైత్రి మూవీ మేకర్స్ కూడా ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ ఎత్తున నిర్మించనుంది. మరి ఈ సినిమాతో సుకుమార్ బన్నీ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తారో చూడాలి.