ఆ విషయంలో తగ్గేదేలే..చిరు ఎన్ని సార్లు మెసేజ్ చేసిన పట్టించుకోని సుమ..!!

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ కి మించిన స్టార్ డమ్.. ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్న యాంకర్ సుమ గురించి ఎంత చెప్పినా తక్కువే . కెరియర్ మొదట్లో తాను సినిమాలో నటించిన యాంకర్ సుమ ఆ తర్వాత తనకు సినిమాలు సెట్ అవ్వవు అంటూ పూర్తి కాన్సన్ట్రేషన్ యాంకరింగ్ పై చేసింది . ఎలాంటి షోస్ నైనా ఎలాంటి ఈవెంట్స్ అయినా సింగిల్ హ్యాండ్ తో మ్యానేజ్ చేసే సుమ ..ప్రెసెంట్ ఒక్కొక్క ఎపిసోడ్ కి లక్షన్నర చార్జ్ చేస్తూ.. టాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న యాంకర్ గా పేరు సంపాదించుకుంటుంది.

వాల్తేరు వీరయ్య సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సుమ హౌస్ట్ చేస్తున్న సుమ అడ్డ షో కు చిరంజీవి వచ్చిన సంగతి తెలిసిందే . ఈ క్రమంలోని చిరంజీవి ఇంట్రెస్టింగ్ విషయాన్ని బయట పెట్టాడు . “సుమకు తాను ఎన్నో సార్లు మెసేజ్ చేశానని ..”హ్యాపీ బర్త డే.. గాడ్ బ్లెస్స్ యు.. స్టే బ్లెస్” అంటూ వరుసగా మూడేళ్లు మెసేజ్ చేశానని.. సుమా ఆ మెసేజ్లు చూడలేదని.. నాకు రిప్లై ఇవ్వలేదని .. నేను చాలా హర్ట్ అయ్యానని చెప్పుకొచ్చాడు.

అయితే ఇదే విషయాన్ని సుమ క్లారిటీ ఇస్తూ..” మీలాంటి పెద్ద హీరో నాకు మెసేజ్ పెడతారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు .. నిజానికి మీ నెంబర్ కూడా నా దగ్గర లేదు” అంటూ చెప్పుకొచ్చింది. ఇక చిరంజీవి కంటిన్యూ చేస్తూ ..”ఆ తర్వాత ఓ ఈవెంట్లో మళ్ళీ సుమకి విషయం చెప్పగా ..సారీ చెబుతూ తన నెంబర్ తీసుకుని సేవ్ చేసి మరి థాంక్యూ చెప్పిందని “చెప్పుకొచ్చాడు చిరంజీవి. ఇలా చిరంజీవి – సుమ మధ్య జరిగిన ఫన్నీ కాన్వర్జేషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..!!