నందమూరి హీరోలకు మరో హిట్ పక్క.. భారీ ధర పలికిన అమిగోస్..!

నందమూరి హీరోలు ప్రస్తుతం టాలీవుడ్ లో ఫుల్ జోష్ లో దూసుకుపోతున్నారు. ఈ హీరోల నుంచి ఏ సినిమా వచ్చినా అది సూపర్ హిట్ గానే నిలుస్తుంది. ముందుగా ఈ కుటుంబం నుంచి బాలకృష్ణ అఖండ సినిమాతో విజయ పరంపర మొదలుపెట్టాడు. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ సినిమాతో ఈ దండయాత్రను పాన్ ఇండియా లెవెల్ కు తీసుకువెళ్లాడు. మరో నందమూరి హీరో కళ్యాణ్ రామ్ బింబిసారా సినిమాతో వచ్చి తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకునీ అదిరిపోయే కలెక్షన్లను కొల్లగొట్టాడు.

Nandamuri Fans : ఇది నందమూరి నామ సంవత్సరం.. అభిమానుల ఆనందానికి  అవధుల్లేవుగా.. - Telugu Cinema News,Filmy Updates,Box Office  Collections,Movie Review Nandamuri Fans Feeling Happy about Bimbisara  Success

ఇక మరి ఈ సంక్రాంతికి వీర సింహారెడ్డిగా వచ్చినన బాలయ్య మరో బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుని తన కెరీర్ లోనే హైయెస్ట్ కలెక్షన్ అందుకున్నాడు. ప్రస్తుతం ఈ ముగ్గురు నందమూరి హీరోలు వరుస‌ సినిమాలతో దూసుకుపోతున్నారు. బాలకృష్ణ తర్వాత మరో నందమూరి కళ్యాణ్‌రామ్ కూడా త్వరలో అమిగోస్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడు. బింబిసారా అలాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత కళ్యాణ్ రామ్ నటించిన సినిమా అమిగోస్.

ఇప్పటికే ఈ సినిమా టీజర్ తో భారీ అంచనాలను పెంచేశాడు. తన కెరీర్ లోనే తొలిసారిగా మూడు విభిన్నమైన క్యారెక్టర్ లో నటిస్తున్నాడు కళ్యాణ్ రామ్. ఈ సినిమాను రాజేందర్ రెడ్డి అనే నూతన దర్శకుడు తెరకెక్కించాడు, మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను ఎంతో గ్రాండ్గా నిర్మించారు. ఫిబ్రవరి 10 ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రాబోతుంది.

Amigos' poster : The Three shades of Kalyan Ram - Cine Chit Chat

అమిగోస్ విడుదలకు ముందే నిర్మాతలకు భారీ లాభాలను తెచ్చిపెట్టింది. బింబిసార అలాంటి హిట్ తర్వాత కళ్యాణ్‌రామ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్ లు భారీ రేటుకు కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది. ఈ సినిమా నాన్ థియేట్రికల్ హక్కులు కూడా భారీ స్థాయిలోనే అమ్ముడుపోయినట్టు తెలుస్తుంది. ఈ సినిమాకు కళ్యాణ్ రామ్ కెరీర్ హైయెస్ట్ బిజినెస్ జరిగినట్టు ట్రేడ్ వర్గాల నుంచి టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాతో కళ్యాణ్ రామ్ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తారో చూడాలి.