కోడిపందాల్లో పాటిస్పేట్ చేసిన ఆ స్టార్ ప్రొడ్యూసర్ భార్య..?

ప్రస్తుతం ఆడవాళ్లు అన్ని రంగాల్లో మగవాళ్లతో సమానంగా పోటీ పడుతున్నారు. మగవాళ్ల లానే అన్ని సరదాలు, సంతోషాలను అనుభవిస్తున్నారు ఆడవాళ్లు. అయితే సాధారణ మహిళల సంగతి పక్కన పెడితే సెలబ్రిటీల భార్యలు మగవారి కంటే ఎక్కువగా ఫోజులు పడుతున్నారు. వీరు చేసే కొన్ని పనులు మీడియాలో సంచలనంగా నిలుస్తున్నాయి. నిజానికి వారు చేసే ఏ చిన్న పనే పెద్ద వార్త అవుతుంది. అలాంటిది ఇప్పుడు ఒక నిర్మాత భార్య కూడా ఈ సంక్రాంతికి ఆంధ్రాకి వెళ్లి కోడి పందాలు ఆడి తన సరదాలను తీర్చుకుంది. దాంతో ఆమె గురించి అటు న్యూస్ మీడియాలో ఇటు ప్రజల్లో పెద్ద చర్చ జరుగుతుంది.

సాధారణంగా సినిమా రంగంలో సెలబ్రిటీలకే కాకుండా వారి జీవితభాగస్వాములకి కూడా ఎంతో కొంత సర్కిల్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. సెలబ్రిటీల లాగే వారి భార్యలకు ఏదో ఒక వ్యాపకం ఉంటుంది. వీలు చిక్కితే వీరు తమ భర్తతో కలిసి సరదాగా గడుపుతారు. ఒకవేళ వారి భర్తలకు ఖాళీ సమయం లేకపోతే ఎవరి సర్కిల్‌తో వారు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే ఒక ప్రముఖ నిర్మాత కూడా తన పనుల్లో చాలా బిజీగా ఉండటంతో పండుగని కుటుంబంతో కలిసి జరుపుకోలేకపోయారు.

దాంతో అతని జీవిత భాగస్వామికి ఆంధ్రాలో వ్యాపారం పరంగా బ్యాక్‌ గ్రౌండ్ ఉండటంతో అక్కడికి వెళ్లి తన స్నేహితురాలతో కలిసి సంక్రాంతి జరుపుకుంది. అంతేకాదు కోడిపందాలను ఆడి ఎంజాయ్ చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఆ స్టార్ ప్రొడ్యూసర్ ఎవరు? అతని భార్య ఎవరు? అనేది ఇంకా బయటికి రాలేదు. సాధారణంగా సినిమా వాళ్ల భార్యలు విదేశాలకి వెళ్లి ఎంజాయ్ చేస్తూ, షాపింగ్ చేస్తుంటారు. కాబట్టి అందులో పెద్ద వింత ఏం ఉండకపోవచ్చు. కానీ ఒక బడా నిర్మాత భార్య కోడిపందాలకు వెళ్లడం అనేది మాత్రం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.