కొంప ముంచేసిన నాగ చైతన్య.. ఆ భారీ ప్రాజెక్ట్ నుండి అవుట్.. కారణం ఇదేనా..!?

అక్కినేని నాగేశ్వరరావు మనవడిగా ..అక్కినేని నాగార్జున కొడుకుగా.. ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన అక్కినేని నాగచైతన్య.. కెరియర్ ప్రజెంట్ ఎలాంటి పొజిషన్లో ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. జోష్ అనే సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య ..మొదటి సినిమాతో యావరేజ్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఆ తర్వాత రెండో సినిమాకే ఏ మాయ చేసావే ఎలాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకోవడం తో నాగచైతన్య పై అంచనాలను భారీగానే పెట్టుకున్నారు అభిమానులు .

అయితే ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ కావడంతో నాగచైతన్యకి హీరో అయ్యేంత సీన్ లేదు అంటూ ముఖానే చెప్పుకొచ్చారు . అయితే అలాంటి కామెంట్స్ ని ఏ మాత్రం పట్టించుకోని నాగచైతన్య తనదైన స్టైల్ లో కంటెంట్ ఉన్న సినిమాలను చూస్ చేసుకుంటూ హిట్లు ప్లాపులు అని తేడా లేకుండా ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్నాడు . కాగా ఈ మధ్యకాలంలో నాగచైతన్య చేసిన ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మారింది . భారీ అంచనాల మధ్య తెరకెక్కిన థాంక్యూ సినిమా థాంక్యూ చెప్పకుండానే టాటా బై బై చెప్పేసింది .

ఇక బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన లాల్ సింగ్ చద్దా సినిమా గురించి అయితే చెప్పనవసరం లేదు . సినిమా ఎందుకు చేశాడు రా బాబు అంటూ అక్కినేని ఫ్యాన్స్ తలలు పట్టుకున్నారు. కాగా ప్రజెంట్ నాగచైతన్య ఆశలన్నీ తన చేస్తున్న సినిమా కస్టడీ పైనే ఉన్నాయి . కాగా ఈ సినిమా తర్వాత నాగచైతన్య సర్కారు వారి పాట సినిమా డైరెక్టర్ పరశురామ్ తో ఓ సినిమాకు కమిట్ అయిన విషయం అందరికీ తెలిసిందే. కస్టడీ సినిమా షూట్ పూర్తి అయిన వెంటనే నాగచైతన్య పరశురాం సినిమాలో జాయిన్ అవ్వాల్సి ఉంది .

కాగా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం నాగచైతన్య – పరశురాం సినిమా ఆగిపోయినట్లు సినీవర్గాల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. దానికి మెయిన్ రీజన్ నాగచైతన్య స్క్రిప్ట్ లో చేంజెస్ చేయమని చెప్పడమే . స్క్రిప్ట్ చెప్పినప్పుడే సినిమాలో పలు వివాదాస్పదమైన సీన్స్ ఉన్నాయని.. వాటిని చేంజ్ చేస్తే కంటెంట్ ఇంకా బాగుంటుందని సజెషన్ ఇచ్చారట . అయితే అప్పుడు ఓకే చెప్పిన పరశురామ్ తాను ఇష్టపడి రాసుకున్న సీన్స్ ను చేంజ్ చేసే ఆప్షన్ లేక నాగచైతన్యతో సినిమా చేసే ఛాన్స్ మిస్ చేసుకున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా సరే వారి పాట సినిమా లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తీసిన డైరెక్టర్ తో నాగచైతన్య సినిమా మిస్ అవ్వడం అక్కినేని ఫ్యాన్స్ కు కొంచెం బాధగా అనిపిస్తుంది . నాగచైతన్య టైం బాగోలేదని చెప్పడానికి ఇది మరో ఎగ్జాంపుల్ అంటూ చెప్పుకొస్తున్నారు..!!